ఆయనాయ మము నింత ఆఱడిఁ బెట్టకువయ్య
(॥పల్లవి॥)
ఆయనాయ మము నింత ఆఱడిఁ బెట్టకువయ్య
చేయి చాఁచితే నీవే చిక్కక మానేవా
(॥ఆయ॥)
సారెసారె నీతోను సలిగెలఁ బెనఁగితే
కేరడమాడేవు గాక కిందుపడేవా
గోరపడక నాయంత గుట్టున నేనుండఁగాను
చేరి దైవమైన దయ సేయకుండీనా
(॥ఆయ॥)
వువ్విళ్లూర నినునెంత వొడఁ బరచుకొనినా
నవ్వులు నవ్వేవు గాక నన్నుఁ గూడేవా
జవ్వనపాయముతోడ చందము సేసుకుండఁగా
యివ్వల మాపుణ్యమైనా యీడేర్చకుండీనా
(॥ఆయ॥)
సేసలు నేఁ బెట్టినాను శ్రీ వేంకటేశ నీవు
ఆలఁ బెట్టేవు గాక అంట నిచ్చేవా
బాసగొని నిను నిట్టే బలిమిఁ గాఁగిలించఁగాను
వాసికైనా మీ మనసు వలవకుండీనా
(||pallavi||)
āyanāya mamu niṁta āṟaḍim̐ bĕṭṭaguvayya
seyi sām̐side nīve sikkaga mānevā
(||āya||)
sārĕsārĕ nīdonu saligĕlam̐ bĕnam̐gide
keraḍamāḍevu gāga kiṁdubaḍevā
gorabaḍaga nāyaṁta guṭṭuna nenuṁḍam̐gānu
seri daivamaina daya seyaguṁḍīnā
(||āya||)
vuvviḽlūra ninunĕṁta vŏḍam̐ barasugŏninā
navvulu navvevu gāga nannum̐ gūḍevā
javvanabāyamudoḍa saṁdamu sesuguṁḍam̐gā
yivvala mābuṇyamainā yīḍersaguṁḍīnā
(||āya||)
sesalu nem̐ bĕṭṭinānu śhrī veṁkaḍeśha nīvu
ālam̐ bĕṭṭevu gāga aṁṭa nichchevā
bāsagŏni ninu niṭṭe balimim̐ gām̐giliṁcham̐gānu
vāsigainā mī manasu valavaguṁḍīnā