Aayanaaya mammunela aaṟadimbettevu neevu

ఆయనాయ మమ్మునేల ఆఱడిఁబెట్టేవు నీవు
Language

(॥పల్లవి॥)
ఆయనాయ మమ్మునేల ఆఱడిఁబెట్టేవు నీవు
చాయల నీవిచ్చినట్టి చనవులే చాలవా

(॥ఆయ॥)
పొగడేవు నన్ను సారెఁ బొందుసేయ నేర్తు నంటా
యెగసక్కేలేలచేసే వింతేసి మమ్ము
మగువనింతే నేను మగవాఁడవు నీవు
నిగుడి నీవు నేర్చిన నేర్పులే చాలవా

(॥ఆయ॥)
మెచ్చేవప్పటి నన్ను మేలుగల దాన నంటా
ఇచ్చకము లేలాడే వింతేసి మాతో
రచ్చకెక్కితివి నీవు రాణివాసమైతి నేను
నిచ్చలుఁ జేసేటి యట్టి నీమేలే చాలదా

(॥ఆయ॥)
కూడితివిచ్చట నన్ను గురియైనదాన నంటా
యీడ వెట్టుకొంటిరా మమ్మెనసి నేఁడు
తోడనే శ్రీవేంకటేశ దొరసినవారము
కోడెకాఁడ నీవొళ్ళి గురుతులే చాలవా

(||pallavi||)
āyanāya mammunela āṟaḍim̐bĕṭṭevu nīvu
sāyala nīvichchinaṭṭi sanavule sālavā

(||āya||)
pŏgaḍevu nannu sārĕm̐ bŏṁduseya nerdu naṁṭā
yĕgasakkelelasese viṁtesi mammu
maguvaniṁte nenu magavām̐ḍavu nīvu
niguḍi nīvu nersina nerbule sālavā

(||āya||)
mĕchchevappaḍi nannu melugala dāna naṁṭā
ichchagamu lelāḍe viṁtesi mādo
rachchagĕkkidivi nīvu rāṇivāsamaidi nenu
nichchalum̐ jeseḍi yaṭṭi nīmele sāladā

(||āya||)
kūḍidivichchaḍa nannu guriyainadāna naṁṭā
yīḍa vĕṭṭugŏṁṭirā mammĕnasi nem̐ḍu
toḍane śhrīveṁkaḍeśha dŏrasinavāramu
koḍĕgām̐ḍa nīvŏḽḽi gurudule sālavā