Aayamu tanagu naagu naadamde kaaga

ఆయము తనకు నాకు నాతఁడే కాక
Language

(॥పల్లవి॥)
ఆయము తనకు నాకు నాతఁడే కాక
ఆయనాయ దూరువాఁడు ఆతఁడే కాక

(॥ఆయ॥)
యెందుకైనఁ దానే వచ్చీ నేదైనాఁ జెల్లఁ బెట్టీ
అందుకేమి చెలి తానా ఆతఁడే కాక
అందాలు సేసుకొనీని ఆడినవెల్లా నాడీ
అందరిలోనిబలువు ఆతఁడే కాక

(॥ఆయ॥)
జంకెనలు నెరపిని సళుపుఁ జూపులఁ జూచీ
అంకగతై యిఁకఁ దాన ఆతఁడేకాక
మంకులు పైన వేసుకొనీ మాఁట చెవి చొరనీదు
అంకెకుఁ దెచ్చేటివాఁడు ఆతఁడే కాక

(॥ఆయ॥)
చూపి మోపి సొలసీని చొక్కులఁబెట్టఁగ వచ్చీ
ఆపనికి గురి దానా ఆతఁడే కాక
యేవున శ్రీవేంకటేశుఁ డిప్పు డిట్టె నన్నుఁ గూడె
ఆఁపరానిచుట్టి మెల్ల నాతఁడేకాక

(||pallavi||)
āyamu tanagu nāgu nādam̐ḍe kāga
āyanāya dūruvām̐ḍu ādam̐ḍe kāga

(||āya||)
yĕṁdugainam̐ dāne vachchī nedainām̐ jĕllam̐ bĕṭṭī
aṁdugemi sĕli tānā ādam̐ḍe kāga
aṁdālu sesugŏnīni āḍinavĕllā nāḍī
aṁdarilonibaluvu ādam̐ḍe kāga

(||āya||)
jaṁkĕnalu nĕrabini saḽubum̐ jūbulam̐ jūsī
aṁkagadai yim̐kam̐ dāna ādam̐ḍegāga
maṁkulu paina vesugŏnī mām̐ṭa sĕvi sŏranīdu
aṁkĕgum̐ dĕchcheḍivām̐ḍu ādam̐ḍe kāga

(||āya||)
sūbi mobi sŏlasīni sŏkkulam̐bĕṭṭam̐ga vachchī
ābanigi guri dānā ādam̐ḍe kāga
yevuna śhrīveṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭĕ nannum̐ gūḍĕ
ām̐parānisuṭṭi mĕlla nādam̐ḍegāga