ఆయము లిఁక నిద్దరి కంటుఁ గాక
(॥పల్లవి॥)
ఆయము లిఁక నిద్దరి కంటుఁ గాక
చేయివల్ల నుండ నేలె చేఁతల యాతనికి
(॥ఆయ॥)
నిగ్గుల నాతఁ డన్నియు నీకెతోఁ జెప్పఁగాను
యెగ్గు లేల పట్టేవె యేమే నీవు
సిగ్గులు నిను రేఁచితె చింతఁ బొరలేదానవు
దగ్గరి కూచుండ నేలె తమకపాతనివి
(॥ఆయ॥)
నెమ్మది నీమోము చూచి నీవిభుఁడె నవ్వఁగాను
యెమ్మె లేల సేసేవె యేమే నీవు
కమ్మ నీకు మొక్కి తేనె కాఁక రేఁగేదానవు
చెమ్మఁజెమ టార్చ నేలె సేవల నాతనికి
(॥ఆయ॥)
వెకలి శ్రీవెంకటాద్రివిభుఁ డిట్టె కూడఁగాను
యెకసక్కే లే లాడేవె యేమే నీవు
వొకటొకటికి నీవు వొరసెటిదానవు
మొకమిచ్చ లాడ నేలె మొదలె యాతనిని
(||pallavi||)
āyamu lim̐ka niddari kaṁṭum̐ gāga
seyivalla nuṁḍa nelĕ sem̐tala yādanigi
(||āya||)
niggula nādam̐ ḍanniyu nīgĕdom̐ jĕppam̐gānu
yĕggu lela paṭṭevĕ yeme nīvu
siggulu ninu rem̐sidĕ siṁtam̐ bŏraledānavu
daggari kūsuṁḍa nelĕ tamagabādanivi
(||āya||)
nĕmmadi nīmomu sūsi nīvibhum̐ḍĕ navvam̐gānu
yĕmmĕ lela sesevĕ yeme nīvu
kamma nīgu mŏkki tenĕ kām̐ka rem̐gedānavu
sĕmmam̐jĕma ṭārsa nelĕ sevala nādanigi
(||āya||)
vĕgali śhrīvĕṁkaḍādrivibhum̐ ḍiṭṭĕ kūḍam̐gānu
yĕgasakke le lāḍevĕ yeme nīvu
vŏgaḍŏgaḍigi nīvu vŏrasĕḍidānavu
mŏgamichcha lāḍa nelĕ mŏdalĕ yādanini