ఆయలేవే చెక్కు నొక్కే వంత యేఁటికి
(॥పల్లవి॥)
ఆయలేవే చెక్కు నొక్కే వంత యేఁటికి
చాయల నీకు నేను చవైతిఁగా నేఁడు
(॥ఆయ॥)
మేలు మేలు నీవు నన్ను మెచ్చితి విన్నాళ్లకు నేఁ
దాలిమి వలపు నీపైఁ దలఁచఁగాను
వాలి నీకుఁ గన్న వారివలపెల్లఁ దలకెక్కి
కాలమం దెరఁగవైతి కంటివాగా నేఁడు
(॥ఆయ॥)
భళి భళి నీచూపు పారెఁగా యిన్నాళ్లకుఁ
బిలిపించి తరవులు వెట్టఁగాను
కలసేటికామాంధకారము కన్నులఁ గప్పి
తలఁచవైతివి నీకుఁ దతివచ్చె నేఁడు
(॥ఆయ॥)
అవునవు కాఁగిట నన్నలమితి విన్నాళ్లకు
వివరించి నీపై మేను వేయఁగాను
జవళి శ్రీవేంకటేశ చలము నీలోన నుండి
తివిరితి విన్నాళ్లకు తిరమైతి నేఁడు
(||pallavi||)
āyaleve sĕkku nŏkke vaṁta yem̐ṭigi
sāyala nīgu nenu savaidim̐gā nem̐ḍu
(||āya||)
melu melu nīvu nannu mĕchchidi vinnāḽlagu nem̐
dālimi valabu nībaim̐ dalam̐sam̐gānu
vāli nīgum̐ ganna vārivalabĕllam̐ dalagĕkki
kālamaṁ dĕram̐gavaidi kaṁṭivāgā nem̐ḍu
(||āya||)
bhaḽi bhaḽi nīsūbu pārĕm̐gā yinnāḽlagum̐
bilibiṁchi taravulu vĕṭṭam̐gānu
kalaseḍigāmāṁdhagāramu kannulam̐ gappi
talam̐savaidivi nīgum̐ dadivachchĕ nem̐ḍu
(||āya||)
avunavu kām̐giḍa nannalamidi vinnāḽlagu
vivariṁchi nībai menu veyam̐gānu
javaḽi śhrīveṁkaḍeśha salamu nīlona nuṁḍi
tiviridi vinnāḽlagu tiramaidi nem̐ḍu