ఆయలేవే జవ్వనపు టంగనల కింత గద్దా
(॥పల్లవి॥)
ఆయలేవే జవ్వనపు టంగనల కింత గద్దా
వో యమ్మ వొకటంటే నొకటనేవే
(॥ఆయ॥)
చెంగట నీపతి వాఁడే చెక్కిటి చే యింక నేలే
ముంగిట రెండు చేతుల మొక్కరాదా
సంగడిఁ గూచుండఁగాను సతులిందరిలోనను
యింగి తాన సిగ్గువడ కెట్టుపండవచ్చునే
(॥ఆయ॥)
అట్టె యాతఁడు పిలిచీ నవ్వలిమో మిఁక నేలే
నట్టుకొట్ట కిఁకనైన నవ్వఁగరాదా
వెట్టికి నాతఁడు వచ్చి వేఁకముగ నూఁదఁగాను
ముట్టి పట్టి నేఁగొంత ములుగఁగ రాదా
(॥ఆయ॥)
శ్రీ వేంకటేశుడు గూడె శిరసు వంచఁగ నేలే
యీవల నాతనిచన వియ్యరాదా
కావిరి నాతఁడు నన్నుఁ గరఁగించి మించఁగాను
సోవల నాలోలో నే చొక్కఁగ రాదా
(||pallavi||)
āyaleve javvanabu ṭaṁganala kiṁta gaddā
vo yamma vŏgaḍaṁṭe nŏgaḍaneve
(||āya||)
sĕṁgaḍa nībadi vām̐ḍe sĕkkiḍi se yiṁka nele
muṁgiḍa rĕṁḍu sedula mŏkkarādā
saṁgaḍim̐ gūsuṁḍam̐gānu saduliṁdarilonanu
yiṁgi tāna sigguvaḍa kĕṭṭubaṁḍavachchune
(||āya||)
aṭṭĕ yādam̐ḍu pilisī navvalimo mim̐ka nele
naṭṭugŏṭṭa kim̐kanaina navvam̐garādā
vĕṭṭigi nādam̐ḍu vachchi vem̐kamuga nūm̐dam̐gānu
muṭṭi paṭṭi nem̐gŏṁta mulugam̐ga rādā
(||āya||)
śhrī veṁkaḍeśhuḍu gūḍĕ śhirasu vaṁcham̐ga nele
yīvala nādanisana viyyarādā
kāviri nādam̐ḍu nannum̐ garam̐giṁchi miṁcham̐gānu
sovala nālolo ne sŏkkam̐ga rādā