ఆయలేవయ్యా సుద్దులన్నియు నెరుఁగుదుము
(॥పల్లవి॥)
ఆయలేవయ్యా సుద్దులన్నియు నెరుఁగుదుము
చాయకాఁడ వౌదువు నీ సట లేఁటికయ్యా
(॥॥)
మితిమీరినవలపు మిక్కుటమై వుండఁగాను
సతిమాటలెల్లా నీకుఁ జవులాయను
వెతదీర విన్నపాలు వేగినంతాఁ జేసినాను
ఇతరులయెడ కింత ఇతవయ్యీనా
(॥॥)
వుప్పతిల్లుఁ దమకము వువిదపై నుండఁగాను
వొప్పి యీపెవిందులెల్లా నొద్దికాయను
ఇప్పు డెవ్వరైనా బోనమింటికి నీకుఁ దెచ్చితే
చప్పనై తోఁ చుఁ గాక ఆసలు వుట్టీనా
(॥॥)
పానుపుమీఁదిరతులు పచ్చిదోఁచి వుండఁగాను
తేనెగారేఆపెమోవి తీపులాయను
ఆనుక శ్రీ వేంకటేశ అట్టె నన్నుఁ గూడితివి
యేనెలఁతలందునైనా ఇటువలె మెచ్చేవా
(||pallavi||)
āyalevayyā suddulanniyu nĕrum̐gudumu
sāyagām̐ḍa vauduvu nī saḍa lem̐ṭigayyā
(||||)
midimīrinavalabu mikkuḍamai vuṁḍam̐gānu
sadimāḍalĕllā nīgum̐ javulāyanu
vĕdadīra vinnabālu veginaṁtām̐ jesinānu
idarulayĕḍa kiṁta idavayyīnā
(||||)
vuppadillum̐ damagamu vuvidabai nuṁḍam̐gānu
vŏppi yībĕviṁdulĕllā nŏddigāyanu
ippu ḍĕvvarainā bonamiṁṭigi nīgum̐ dĕchchide
sappanai tom̐ sum̐ gāga āsalu vuṭṭīnā
(||||)
pānubumīm̐diradulu pachchidom̐si vuṁḍam̐gānu
tenĕgāreābĕmovi tībulāyanu
ānuga śhrī veṁkaḍeśha aṭṭĕ nannum̐ gūḍidivi
yenĕlam̐talaṁdunainā iḍuvalĕ mĕchchevā