ఆయలేరే యేడ సుద్ది ఆతనికి నిది వన్నె
(॥పల్లవి॥)
ఆయలేరే యేడ సుద్ది ఆతనికి నిది వన్నె
సేయుమన్నట్టెల్లా నేనే సేసేఁగాక
(॥ఆయ॥)
అట్టె రమణునికి నంతబాఁతే మామీంద
పట్టినవ్రతాన నేనే పైకొనేఁగాక
గుట్టు విడువఁ డాతండు కోరి మమ్ముఁ గైకొనీనా
వెట్టివలపులదాన వెస నేనే కాక
(॥ఆయ॥)
తావుల పెక్కిండ్లవిందు తలఁచీనా మమ్ము నేండు
కావలెననుచు నేనే కదిసేఁగాక
దేవరవంటివాఁడు తెమలీనా తనుందానె
వావులు వెదకేదాన వడి నేనే కాక
(॥ఆయ॥)
అమ్మరో శ్రీవేంకటేశు కపురూపమా చెలులు
నెమ్మది మేనదాన నేనే కాక
వుమ్మడిం బంతమాడక వూరకుండీనా యీతఁడు
యెమ్మెల యిచ్చకురాల యేడా నేనే కాక
(||pallavi||)
āyalere yeḍa suddi ādanigi nidi vannĕ
seyumannaṭṭĕllā nene sesem̐gāga
(||āya||)
aṭṭĕ ramaṇunigi naṁtabām̐te māmīṁda
paṭṭinavradāna nene paigŏnem̐gāga
guṭṭu viḍuvam̐ ḍādaṁḍu kori mammum̐ gaigŏnīnā
vĕṭṭivalabuladāna vĕsa nene kāga
(||āya||)
tāvula pĕkkiṁḍlaviṁdu talam̐sīnā mammu neṁḍu
kāvalĕnanusu nene kadisem̐gāga
devaravaṁṭivām̐ḍu tĕmalīnā tanuṁdānĕ
vāvulu vĕdagedāna vaḍi nene kāga
(||āya||)
ammaro śhrīveṁkaḍeśhu kaburūbamā sĕlulu
nĕmmadi menadāna nene kāga
vummaḍiṁ baṁtamāḍaga vūraguṁḍīnā yīdam̐ḍu
yĕmmĕla yichchagurāla yeḍā nene kāga