ఆయలేరా యిప్పు డన్నీ నాడేవు గాక
(॥పల్లవి॥)
ఆయలేరా యిప్పు డన్నీ నాడేవు గాక
యే యెడనైనా నీ తగ విట్టే నడపేవా
(॥ఆయలే॥)
అక్కడ వేరొకతెపై నాసలఁ బొరలే నీవు
చక్కెరవంటి నా మోవి సడ్డ సేసేవా
మక్కువ జవ్వనమదమత్తుఁడవై వున్నాఁడవు
తక్కక నా పొందులు తలఁపయ్యీనా
(॥ఆయలే॥)
చండతో నెవ్వతెయైనా సాటి వెట్టి యడిగితే
కొండలంత నా చన్నులు కొనియాడేవా
గండుమీరి మిక్కుటవు కాంక్షల నున్నాఁడవు
దండియైన నా రతులు తనివి యయ్యీనా
(॥ఆయలే॥)
సిగ్గులు వడుతా నాపెచెంగట నుండిననీవు
యెగ్గు లేని నా మాటల కియ్యకొనేవా
అగ్గమై శ్రీవేంకటేశ అంతలో న న్నేలితివి
వొగ్గిన చేఁతల కెల్లా వొడి గట్టేవా
(||pallavi||)
āyalerā yippu ḍannī nāḍevu gāga
ye yĕḍanainā nī taga viṭṭe naḍabevā
(||āyale||)
akkaḍa verŏgadĕbai nāsalam̐ bŏrale nīvu
sakkĕravaṁṭi nā movi saḍḍa sesevā
makkuva javvanamadamattum̐ḍavai vunnām̐ḍavu
takkaga nā pŏṁdulu talam̐payyīnā
(||āyale||)
saṁḍado nĕvvadĕyainā sāḍi vĕṭṭi yaḍigide
kŏṁḍalaṁta nā sannulu kŏniyāḍevā
gaṁḍumīri mikkuḍavu kāṁkṣhala nunnām̐ḍavu
daṁḍiyaina nā radulu tanivi yayyīnā
(||āyale||)
siggulu vaḍudā nābĕsĕṁgaḍa nuṁḍinanīvu
yĕggu leni nā māḍala kiyyagŏnevā
aggamai śhrīveṁkaḍeśha aṁtalo na nnelidivi
vŏggina sem̐tala kĕllā vŏḍi gaṭṭevā