Aayaleraa pamtamaadeyamdu kemiraa

ఆయలేరా పంతమాడేయందు కేమిరా
Language

(॥పల్లవి॥)
ఆయలేరా పంతమాడేయందు కేమిరా
యేయెడ నెంతోరిచినా నెఱఁగవుగాక

(॥ఆయ॥)
అంటిముట్టి సరసము లాడలేనా నీ మేను
వొంటిఁగాలు దాఁకుఁ జేసు వొద్దనికాక
వెంటవెంటఁ దిప్పీ నిన్ను వేగ వలపించలేనా
నంటున నన్నిందరు న వ్వేరని కాక

(॥ఆయ॥)
ముందు నిన్నుఁ దమిరేఁచి మొక్కించుకొనలేనా
ఆందరిలో నిది దోసమనికాక
పందెమాడినటు నీమై పచ్చిగాఁ జేయఁగలేనా
అందపునీమేను రేకలయ్యీనని కాక

(॥ఆయ॥)
మోవి ఇచ్చి పుక్కిటఁదమ్ములము నే నించలేనా
భావించి నాలోనే సిగ్గువడికాక
శ్రీవేంకటేశ నీవే చేరి నన్నుఁ గూడితివి
యీవల నలమేల్మంగ నిరవైతిఁగాక

(||pallavi||)
āyalerā paṁtamāḍeyaṁdu kemirā
yeyĕḍa nĕṁtorisinā nĕṟam̐gavugāga

(||āya||)
aṁṭimuṭṭi sarasamu lāḍalenā nī menu
vŏṁṭim̐gālu dām̐kum̐ jesu vŏddanigāga
vĕṁṭavĕṁṭam̐ dippī ninnu vega valabiṁchalenā
naṁṭuna nanniṁdaru na vverani kāga

(||āya||)
muṁdu ninnum̐ damirem̐si mŏkkiṁchugŏnalenā
āṁdarilo nidi dosamanigāga
paṁdĕmāḍinaḍu nīmai pachchigām̐ jeyam̐galenā
aṁdabunīmenu regalayyīnani kāga

(||āya||)
movi ichchi pukkiḍam̐dammulamu ne niṁchalenā
bhāviṁchi nālone sigguvaḍigāga
śhrīveṁkaḍeśha nīve seri nannum̐ gūḍidivi
yīvala nalamelmaṁga niravaidim̐gāga