ఆయలేరా మాతోనే అంత యేఁటికి
(॥పల్లవి॥)
ఆయలేరా మాతోనే అంత యేఁటికి
చాయలకు సన్నలకు చవులువుట్టీనా
(॥॥)
బలిమిఁ బట్టకురా పనిగల దీవేళ
బలిమెల్లా నాఁడువారిపైనేయటరా
చలమింతేఁటికిరా సమ్మతి రేపయ్యీఁగాక
వలపు లింతటిలోనే వడ్డికిఁ బారీనా
(॥॥)
కొనగోర నొత్తకురా కుమ్మెవోయీ ముఁజేయి
కొనఁబెట్టి మోహాలు కొనసాగీనా
వెనక వచ్చేరా వీరిడిఁ జేయకు నన్ను
ననిచినమన సిట్టేనాని మెత్తనాయనా
(॥॥)
పయిఁ జేయివేయకురా పట్టరాదు మేనికాఁక
ప్రియములు పెంచఁ బెంచఁ బెంటలయ్యీనా
దయతో శ్రీవెంకటేశ తగిలి కూడితి నన్ను
క్రియ వచ్చె నిఁక నిన్నుఁ గేరడమాడేనా
(||pallavi||)
āyalerā mādone aṁta yem̐ṭigi
sāyalagu sannalagu savuluvuṭṭīnā
(||||)
balimim̐ baṭṭagurā panigala dīveḽa
balimĕllā nām̐ḍuvāribaineyaḍarā
salamiṁtem̐ṭigirā sammadi rebayyīm̐gāga
valabu liṁtaḍilone vaḍḍigim̐ bārīnā
(||||)
kŏnagora nŏttagurā kummĕvoyī mum̐jeyi
kŏnam̐bĕṭṭi mohālu kŏnasāgīnā
vĕnaga vachcherā vīriḍim̐ jeyagu nannu
nanisinamana siṭṭenāni mĕttanāyanā
(||||)
payim̐ jeyiveyagurā paṭṭarādu menigām̐ka
priyamulu pĕṁcham̐ bĕṁcham̐ bĕṁṭalayyīnā
dayado śhrīvĕṁkaḍeśha tagili kūḍidi nannu
kriya vachchĕ nim̐ka ninnum̐ geraḍamāḍenā