Aayale yemta ledu nee yadamadaalu

ఆయలే యెంత లేదు నీ యటమటాలు
Language

(॥పల్లవి॥)
ఆయలే యెంత లేదు నీ యటమటాలు
వేయుమారులేల మమ్ము వేఁడుకొనే విపుడు

(॥ఆయ॥)
ఆరూడి(ఢి)గా నిన్నుఁ దిట్టి ఆయము లంటితేఁ దట్టి
నేరములెంచే సతులు నీకుఁ బ్రియము
చేరువ గాఁచుక వుండి సేవలెల్లా నీకుఁజేసి
మేరలు మీరని మమ్ము మెచ్చేవా నీవు

(॥ఆయ॥)
చెక్కులు సారెకు నొక్కి సిగ్గుతో పాదాలు దొక్కి
నిక్కి నిక్కి చూచేవారు నీకుఁ బ్రియము
మొక్కుచుఁ గందువ చూపి మోహములు రెట్టింపించి
మిక్కుటమైన వారి మెచ్చేవా నీవు

(॥ఆయ॥)
బలిమి నిన్నుఁ గలసి పంతములనే సొలసి
నెలకొని వుండేవారు నీకుఁ బ్రియము
యెలమి శ్రీ వేంకటేశ ఇట్టె నన్నుఁగూడితివి
మెలఁగి వొకపాటివారి మెచ్చేవా నీవు

(||pallavi||)
āyale yĕṁta ledu nī yaḍamaḍālu
veyumārulela mammu vem̐ḍugŏne vibuḍu

(||āya||)
ārūḍi(ḍhi)gā ninnum̐ diṭṭi āyamu laṁṭidem̐ daṭṭi
neramulĕṁche sadulu nīgum̐ briyamu
seruva gām̐suga vuṁḍi sevalĕllā nīgum̐jesi
meralu mīrani mammu mĕchchevā nīvu

(||āya||)
sĕkkulu sārĕgu nŏkki siggudo pādālu dŏkki
nikki nikki sūsevāru nīgum̐ briyamu
mŏkkusum̐ gaṁduva sūbi mohamulu rĕṭṭiṁpiṁchi
mikkuḍamaina vāri mĕchchevā nīvu

(||āya||)
balimi ninnum̐ galasi paṁtamulane sŏlasi
nĕlagŏni vuṁḍevāru nīgum̐ briyamu
yĕlami śhrī veṁkaḍeśha iṭṭĕ nannum̐gūḍidivi
mĕlam̐gi vŏgabāḍivāri mĕchchevā nīvu