ఆయలే సటలేఁటికి నప్పటి నీవు
(॥పల్లవి॥)
ఆయలే సటలేఁటికి నప్పటి నీవు
ఆయములు గరఁగీనా ఆకె వుండఁగాను
(॥ఆయ॥)
సేవలు సేసేనంటే సెలవయ్యీనా నీకు
ఆవల వేరొకతెపై నాస వుండఁగా
మోవితేనె లడిగితే మోహము వుట్టేనా
తావుకొని యాపె నీదండ నుండఁగాను
(॥ఆయ॥)
చెక్కులెంత నొక్కినాను సిగ్గులు మానీనా
చొక్కించి సతులెదుటఁ జూడఁగాను
మక్కువ నే జల్లితేను మనసు వచ్చీనా
చక్కఁగా నాపె చెయ్యి చాఁచుకుండఁగాను
(॥ఆయ॥)
వంతుకు నే నవ్వితేను వలపుల రేఁగీనా
సంతతము నాకె రతి చవి చూపఁగా
యింతలోనె శ్రీవేంకటేశ నన్ను నేలితివి
వింతగా నాకెఁ గూడవా వెసనే నుండఁగాను
(||pallavi||)
āyale saḍalem̐ṭigi nappaḍi nīvu
āyamulu garam̐gīnā āgĕ vuṁḍam̐gānu
(||āya||)
sevalu sesenaṁṭe sĕlavayyīnā nīgu
āvala verŏgadĕbai nāsa vuṁḍam̐gā
movidenĕ laḍigide mohamu vuṭṭenā
tāvugŏni yābĕ nīdaṁḍa nuṁḍam̐gānu
(||āya||)
sĕkkulĕṁta nŏkkinānu siggulu mānīnā
sŏkkiṁchi sadulĕduḍam̐ jūḍam̐gānu
makkuva ne jallidenu manasu vachchīnā
sakkam̐gā nābĕ sĕyyi sām̐suguṁḍam̐gānu
(||āya||)
vaṁtugu ne navvidenu valabula rem̐gīnā
saṁtadamu nāgĕ radi savi sūbam̐gā
yiṁtalonĕ śhrīveṁkaḍeśha nannu nelidivi
viṁtagā nāgĕm̐ gūḍavā vĕsane nuṁḍam̐gānu