ఆయడ నేమరితి నే నంటిపట్టి నిలుప నైతి
(॥పల్లవి॥)
ఆయడ నేమరితి నే నంటిపట్టి నిలుప నైతి
కాయ మిదె ప్రాయ మిదె ఘనుఁ డెం దున్నాఁడో
(॥ఆయడ॥)
కాంతుని నేఁ గలలోనఁ గౌఁగిలించిన ట్లాయ
నంతలోనే పులకించిన ట్లాయను
చెంతల నా చెక్కు లెల్లాఁ జెమరించిన ట్లాయ
వింత లెల్లా మేనఁ గంటి విభుఁడెందున్నాఁడో
(॥ఆయడ॥)
మనసిచ్చి వానితోనే మాటలాడిన ట్లాయ
ననుపై సెలవులనే నవ్విన ట్లాయ
కినిసి నే నాతనికి కిందుపడిన ట్లాయ
పను లెల్లా మేనఁ గంటి పతి యెందున్నాఁడో
(॥ఆయడ॥)
చక్కఁగా నాతనిమోవి చవిగొన్న యట్లాయ
సుక్కుదీర మై మఱచి చొక్కిన ట్లాయ
నిక్కి శ్రీవేంకటపతి నిక్కలగా నన్నుఁ గూడె
దక్కి నే సుర మెక్కితి తా నెందున్నాఁడో
(||pallavi||)
āyaḍa nemaridi ne naṁṭibaṭṭi niluba naidi
kāya midĕ prāya midĕ ghanum̐ ḍĕṁ dunnām̐ḍo
(||āyaḍa||)
kāṁtuni nem̐ galalonam̐ gaum̐giliṁchina ṭlāya
naṁtalone pulagiṁchina ṭlāyanu
sĕṁtala nā sĕkku lĕllām̐ jĕmariṁchina ṭlāya
viṁta lĕllā menam̐ gaṁṭi vibhum̐ḍĕṁdunnām̐ḍo
(||āyaḍa||)
manasichchi vānidone māḍalāḍina ṭlāya
nanubai sĕlavulane navvina ṭlāya
kinisi ne nādanigi kiṁdubaḍina ṭlāya
panu lĕllā menam̐ gaṁṭi padi yĕṁdunnām̐ḍo
(||āyaḍa||)
sakkam̐gā nādanimovi savigŏnna yaṭlāya
sukkudīra mai maṟasi sŏkkina ṭlāya
nikki śhrīveṁkaḍabadi nikkalagā nannum̐ gūḍĕ
dakki ne sura mĕkkidi tā nĕṁdunnām̐ḍo