Aayaalu dorali vachchinamdulonane

ఆయాలు దొరలి వచ్చినందులోననే
Language

(॥పల్లవి॥)
ఆయాలు దొరలి వచ్చినందులోననే
చాయలా సన్నలా సిగ్గు చల్లితేనే చాలదా

(॥ఆయా॥)
తాలిమిగలవారికి తమకించ నేఁటికి
చాలుకొని వచ్చితేనే చాలదటవే
వేళగాచేవారికి వెక్కసము లేఁటికి
సోలగిలఁ జెక్కుచేతఁ జూచినదే చాలదా

(॥ఆయా॥)
నేరుపుగలవారికి నీటు చూప నేఁటికి
మేరతో దగ్గరనుంటే మేలుగాదటే
దారకపువారికి దంటతనా లేఁటికి
చేరవచ్చి బుద్దులెల్లా జెప్పితేనే చాలదా

(॥ఆయా॥)
సరసులైన వారికిసాదించనేఁటికి
ధర నిచ్చకమాడుటే తగదటవే
యిరవై శ్రీవేంకటేశు డేలె నన్నిందుకొరకె
సరిత లెరిఁగి మోవి చవిగొంటే చాలదా

(||pallavi||)
āyālu dŏrali vachchinaṁdulonane
sāyalā sannalā siggu sallidene sāladā

(||āyā||)
tālimigalavārigi tamagiṁcha nem̐ṭigi
sālugŏni vachchidene sāladaḍave
veḽagāsevārigi vĕkkasamu lem̐ṭigi
solagilam̐ jĕkkusedam̐ jūsinade sāladā

(||āyā||)
nerubugalavārigi nīḍu sūba nem̐ṭigi
merado daggaranuṁṭe melugādaḍe
dāragabuvārigi daṁṭadanā lem̐ṭigi
seravachchi buddulĕllā jĕppidene sāladā

(||āyā||)
sarasulaina vārigisādiṁchanem̐ṭigi
dhara nichchagamāḍuḍe tagadaḍave
yiravai śhrīveṁkaḍeśhu ḍelĕ nanniṁdugŏragĕ
sarida lĕrim̐gi movi savigŏṁṭe sāladā