ఆయ రావే యేడ సుద్ది అందువంక నేమి గద్దు
(॥పల్లవి॥)
ఆయ రావే యేడ సుద్ది అందువంక నేమి గద్దు
పాయపు వేడుకకాఁడు భయపడేనా
(॥ఆయ॥)
చేయిమీఁదై చేఁతచేసి సెలవుల నవ్వుఁగాక
యీయెడ నెంతదిట్టినా యెదురాడీనా
కాయకపుటందగాఁడు కతలెల్లాఁ జెప్పుఁగాక
రాయడించి వొద్దనినా రాక మానీనా
(॥ఆయ॥)
తగవుచాలనివాఁడు తలవంచుకొనుఁగాక
జిగి నెంత గాదనినా సిగ్గువడీనా
సొగసి వేడుకకాఁడు చూరువట్టి వేలుఁగాక
వెగటుగా దొబ్బినాను విడువఁబొయ్యీనా
(॥ఆయ॥)
నేరమిపైఁబడ్డవాండు నిండా నోర్చుకుండుఁగాక
సారె నెంత జంకించినా చండి మానీనా
సారపుశ్రీవేంకటేశ్వరుఁడిదె నన్నుఁ గూడె
మీరేమి చెప్పినా మించి వీఁగీనా
(||pallavi||)
āya rāve yeḍa suddi aṁduvaṁka nemi gaddu
pāyabu veḍugagām̐ḍu bhayabaḍenā
(||āya||)
seyimīm̐dai sem̐tasesi sĕlavula navvum̐gāga
yīyĕḍa nĕṁtadiṭṭinā yĕdurāḍīnā
kāyagabuḍaṁdagām̐ḍu kadalĕllām̐ jĕppum̐gāga
rāyaḍiṁchi vŏddaninā rāga mānīnā
(||āya||)
tagavusālanivām̐ḍu talavaṁchugŏnum̐gāga
jigi nĕṁta gādaninā sigguvaḍīnā
sŏgasi veḍugagām̐ḍu sūruvaṭṭi velum̐gāga
vĕgaḍugā dŏbbinānu viḍuvam̐bŏyyīnā
(||āya||)
neramibaim̐baḍḍavāṁḍu niṁḍā norsuguṁḍum̐gāga
sārĕ nĕṁta jaṁkiṁchinā saṁḍi mānīnā
sārabuśhrīveṁkaḍeśhvarum̐ḍidĕ nannum̐ gūḍĕ
mīremi sĕppinā miṁchi vīm̐gīnā