ఆయ రావయ్య లోనికి నారగింతువు
(॥పల్లవి॥)
ఆయ రావయ్య లోనికి నారగింతువు
కాయమెంత అంటినాను కరఁగీ నామనసు
(॥ఆయ॥)
ఏడనుండి వచ్చి సతులెందరు చెనకినాను
వేడుకకాఁడవు నీవు వేసరేవా
జాడతోడ మదనశాస్త్రము లెన్ని చదివినా
తోడనే నీవీనుల గొందులు తనిసీనా
(॥ఆయ॥)
తరణులెంత నీనోటఁ దములము వెట్టినాను
ధర నీనోరు నొచ్చీనా దక్కుఁగాక
దొరకొనొకరొకరి తొడమీఁదఁ గూచుండినా
గరిమ నలసీనా కాయగాచుఁ గాక
(॥ఆయ॥)
యెందరు కాఁగిట నిన్ను నెంగిలి సేసినాను
యెందుకై నా నొగ్గక నీ వేవగించేవా
ముందె శ్రీ వేంకటేశ ముంచి నన్ను నేలితివి
అంది యింకా నన్నే కూడకారడిఁ బెట్టేవా
(||pallavi||)
āya rāvayya lonigi nāragiṁtuvu
kāyamĕṁta aṁṭinānu karam̐gī nāmanasu
(||āya||)
eḍanuṁḍi vachchi sadulĕṁdaru sĕnaginānu
veḍugagām̐ḍavu nīvu vesarevā
jāḍadoḍa madanaśhāstramu lĕnni sadivinā
toḍane nīvīnula gŏṁdulu tanisīnā
(||āya||)
taraṇulĕṁta nīnoḍam̐ damulamu vĕṭṭinānu
dhara nīnoru nŏchchīnā dakkum̐gāga
dŏragŏnŏgarŏgari tŏḍamīm̐dam̐ gūsuṁḍinā
garima nalasīnā kāyagāsum̐ gāga
(||āya||)
yĕṁdaru kām̐giḍa ninnu nĕṁgili sesinānu
yĕṁdugai nā nŏggaga nī vevagiṁchevā
muṁdĕ śhrī veṁkaḍeśha muṁchi nannu nelidivi
aṁdi yiṁkā nanne kūḍagāraḍim̐ bĕṭṭevā