ఆయ లేవే నీ యెతులన్నియుఁ గంటిమి నేఁడు
(॥పల్లవి॥)
ఆయ లేవే నీ యెతులన్నియుఁ గంటిమి నేఁడు
చాయలా సన్నలనే జరపేవు పొద్దులు
(॥ఆయ॥)
మొనసి చూచేవారి ముందరనెల్ల నీపతి-
చనవులే నెరుపేవు సారె సారెను
వినఁగలిగితేఁ జాలు వేసర కెందాఁకనైన
పనిలేని కతలెల్లఁ బచరించేవిపుడు
(॥ఆయ॥)
యిమ్ముల నీవద్దనుంటే యెవ్వరికైనా నీ-
సొమ్ములెల్లాఁ జూపేవు సోద్యాలుగాను
సమ్మతించితేఁ జాలు సవతులనిందరిని
పమ్మిన యీవులఁ గిందుపఱచేవు నీవు
(॥ఆయ॥)
చెలిమి నీతోఁ జేసితే శ్రీవేంకటేశ్వరుని
కలయికకుఁ దెచ్చేవు కమ్మటి మమ్ము
వలెనంటేఁ జాలు నీవారైన వారికెల్ల
నెలవుగ నీమహిమ నెరుపేవు మిగుల
(||pallavi||)
āya leve nī yĕdulanniyum̐ gaṁṭimi nem̐ḍu
sāyalā sannalane jarabevu pŏddulu
(||āya||)
mŏnasi sūsevāri muṁdaranĕlla nībadi-
sanavule nĕrubevu sārĕ sārĕnu
vinam̐galigidem̐ jālu vesara kĕṁdām̐kanaina
panileni kadalĕllam̐ basariṁchevibuḍu
(||āya||)
yimmula nīvaddanuṁṭe yĕvvarigainā nī-
sŏmmulĕllām̐ jūbevu sodyālugānu
sammadiṁchidem̐ jālu savadulaniṁdarini
pammina yīvulam̐ giṁdubaṟasevu nīvu
(||āya||)
sĕlimi nīdom̐ jeside śhrīveṁkaḍeśhvaruni
kalayigagum̐ dĕchchevu kammaḍi mammu
valĕnaṁṭem̐ jālu nīvāraina vārigĕlla
nĕlavuga nīmahima nĕrubevu migula