Aaya lere yemi seppe raadani suddulu naagu

ఆయ లేరే యేమి చెప్పే రాతని సుద్దులు నాకు
Language

(॥పల్లవి॥)
ఆయ లేరే యేమి చెప్పే రాతని సుద్దులు నాకు
తాయి మక్కళాలే కాక దయ గద్దా తనకు

(॥ఆయ॥)
కన్నులఁజూడనే పట్టె కాఁకలు సేయనే పట్టె
యిన్నిటా తా నన్నుఁ గూడే దెప్పుడో కాని
సన్నలు సేయనే పట్టె చవులు చూపనే పట్టె
వెన్నెల బాయిటికి రా వేళ లేదు తనకు

(॥ఆయ॥)
నవ్వులు నవ్వనే పట్టె నాలి సేయనే పట్టె
యివ్వల నన్నుఁ గూడేది యెన్నఁడే తాను
పువ్వుల వేయనే పట్టె బుజ్జగించనే పట్టె
పవ్వళంచఁ బొద్దు లేదు పను లే లే తనకు

(॥ఆయ॥)
మాటలాడనే పట్టె మనసు చూడనే పట్టె
యీటునఁ గాలు దొక్కేది యెన్నఁడే తాను
పాటించి శ్రీవేంకటాద్రిపతి నన్ను నురముపై
తేటలుగా నెక్కించుక దించ నెడ లేదు

(||pallavi||)
āya lere yemi sĕppe rādani suddulu nāgu
tāyi makkaḽāle kāga daya gaddā tanagu

(||āya||)
kannulam̐jūḍane paṭṭĕ kām̐kalu seyane paṭṭĕ
yinniḍā tā nannum̐ gūḍe dĕppuḍo kāni
sannalu seyane paṭṭĕ savulu sūbane paṭṭĕ
vĕnnĕla bāyiḍigi rā veḽa ledu tanagu

(||āya||)
navvulu navvane paṭṭĕ nāli seyane paṭṭĕ
yivvala nannum̐ gūḍedi yĕnnam̐ḍe tānu
puvvula veyane paṭṭĕ bujjagiṁchane paṭṭĕ
pavvaḽaṁcham̐ bŏddu ledu panu le le tanagu

(||āya||)
māḍalāḍane paṭṭĕ manasu sūḍane paṭṭĕ
yīḍunam̐ gālu dŏkkedi yĕnnam̐ḍe tānu
pāḍiṁchi śhrīveṁkaḍādribadi nannu nuramubai
teḍalugā nĕkkiṁchuga diṁcha nĕḍa ledu