ఆవధరించఁగదయ్య అన్నిరసములు నీవు
(॥పల్లవి॥)
ఆవధరించఁగదయ్య అన్నిరసములు నీవు
తివురుచు నబ్బెనిదె తేనె మోవిరసము
(॥అవ॥)
చెలియచక్కఁదనాన శృంగారరసము
వెలయ బొమజంకెనల వీరరసము
కలయు రతికాంక్షలను కరుణారసము
అలరు మైపులకలను అద్భుతరసంబు
(॥అవ॥)
తరుణిసరసములను తగుహస్యరసము
పరుషంపువిరహన భయరసంబు
బెరయు నిబ్బరములను బీభత్సరసము
గరిమ మరుయుద్ధాన ఘనరౌద్రరసము
(॥అవ॥)
వనిత ఆనందముల వడిశాంతరసము
ననుపుమంతనములను నవరసములు
యెనలేని శ్రీ వేంకటేశ నీతోఁ గూడి
దిన దిన వినోదాల తిరమాయ రసము
(||pallavi||)
āvadhariṁcham̐gadayya annirasamulu nīvu
tivurusu nabbĕnidĕ tenĕ movirasamu
(||ava||)
sĕliyasakkam̐danāna śhṛṁgārarasamu
vĕlaya bŏmajaṁkĕnala vīrarasamu
kalayu radigāṁkṣhalanu karuṇārasamu
alaru maibulagalanu adbhudarasaṁbu
(||ava||)
taruṇisarasamulanu taguhasyarasamu
paruṣhaṁpuvirahana bhayarasaṁbu
bĕrayu nibbaramulanu bībhatsarasamu
garima maruyuddhāna ghanaraudrarasamu
(||ava||)
vanida ānaṁdamula vaḍiśhāṁtarasamu
nanubumaṁtanamulanu navarasamulu
yĕnaleni śhrī veṁkaḍeśha nīdom̐ gūḍi
dina dina vinodāla tiramāya rasamu