Aatte seyavayya yeduraada nemtigi

ఆట్టె సేయవయ్య యెదురాడ నేఁటికి
Language

(॥పల్లవి॥)
ఆట్టె సేయవయ్య యెదురాడ నేఁటికి
పట్టి యలవాటు లప్పటిఁ జేసుకొనేవా

(॥అట్టె॥)
తిలకించి చెప్పరాని తిట్టు నీవు దిట్టితేను
పలికినట్టే పలుక పంతమా మాకు
నెలకొని యీడనాడ నేరుచుక వచ్చి యీడ
పలుమారు గుణించుక పాటము గొనేవా

(॥అట్టె॥)
సేసవెట్టి సేయరాని సేఁతలేల్లా మించఁగాను
సేసినట్టే సేయ మాకుఁ జెల్లుబళ్లా
లాసి యిందరి గరిడి లలిసాము సేసి వచ్చి
మూసిపోకుండా నీడ మరి తలపోసేవా

(॥అట్టె॥)
నయగారితనముల నవ్వులెల్లా నవ్వేవు
మయికి ముయి మళ్ళించ ముచ్చట గాదా
దయతో శ్రీవేంకటేశ తగ నన్నుఁ గూడితివి
నియతి జాణతనాలు నీవే నేర్చినవా

(||pallavi||)
āṭṭĕ seyavayya yĕdurāḍa nem̐ṭigi
paṭṭi yalavāḍu lappaḍim̐ jesugŏnevā

(||aṭṭĕ||)
tilagiṁchi sĕpparāni tiṭṭu nīvu diṭṭidenu
paliginaṭṭe paluga paṁtamā māgu
nĕlagŏni yīḍanāḍa nerusuga vachchi yīḍa
palumāru guṇiṁchuga pāḍamu gŏnevā

(||aṭṭĕ||)
sesavĕṭṭi seyarāni sem̐talellā miṁcham̐gānu
sesinaṭṭe seya māgum̐ jĕllubaḽlā
lāsi yiṁdari gariḍi lalisāmu sesi vachchi
mūsiboguṁḍā nīḍa mari talabosevā

(||aṭṭĕ||)
nayagāridanamula navvulĕllā navvevu
mayigi muyi maḽḽiṁcha muchchaḍa gādā
dayado śhrīveṁkaḍeśha taga nannum̐ gūḍidivi
niyadi jāṇadanālu nīve nersinavā