ఆసోదకుఁడవు నినే(నిన్నే?)మనేమయ్యా
(॥పల్లవి॥)
ఆసోదకుఁడవు నినే(నిన్నే?)మనేమయ్యా
ఆ సుద్దు లింకానా అవునయ్యా
(॥ఆసో॥)
కప్పురము చేతికిచ్చి కలయఁగ విడెమిచ్చి
చెప్పరానిమాటలెల్లాఁ జెప్పిచెప్పి
అప్పసము నీవద్ద నాపె గాచుకుండఁగాను
అప్పటి మమ్ముఁ జెనకే వవునయ్యా
(॥ఆపో॥)
గందము నీపైఁ బూసి కమ్మి సురటి విసరి
గొందిఁ బానుపు వరచి గుబ్బల నొత్తి
యెందునుఁ బాయక ఆకె యేఁకారుచుండఁగాను
అంది మాపైఁ జేయిచాఁచే వవునయ్యా
(॥ఆపో॥)
సిగ్గులెల్ల విడిపించి చేరి మోవి గంటిసేసి
వెగ్గళపునవ్వు నవ్వి వేసాలు సేసి
వొగ్గి శ్రీవేంకటేశ్వర వొడిగ ట్టాపె వుండఁగ
అగ్గమై నన్నుఁ గూడితి వవునయ్యా
(||pallavi||)
āsodagum̐ḍavu nine(ninne?)manemayyā
ā suddu liṁkānā avunayyā
(||āso||)
kappuramu sedigichchi kalayam̐ga viḍĕmichchi
sĕpparānimāḍalĕllām̐ jĕppisĕppi
appasamu nīvadda nābĕ gāsuguṁḍam̐gānu
appaḍi mammum̐ jĕnage vavunayyā
(||ābo||)
gaṁdamu nībaim̐ būsi kammi suraḍi visari
gŏṁdim̐ bānubu varasi gubbala nŏtti
yĕṁdunum̐ bāyaga āgĕ yem̐kārusuṁḍam̐gānu
aṁdi mābaim̐ jeyisām̐se vavunayyā
(||ābo||)
siggulĕlla viḍibiṁchi seri movi gaṁṭisesi
vĕggaḽabunavvu navvi vesālu sesi
vŏggi śhrīveṁkaḍeśhvara vŏḍiga ṭṭābĕ vuṁḍam̐ga
aggamai nannum̐ gūḍidi vavunayyā