(॥పల్లవి॥)
ఆసోదకాఁడవు నీ వన్నిటాను
ఆ సుద్దులే యడిగి నీ వానతియ్యవయ్యా
(॥ఆసోద॥)
చిడిముడి నాచేయి చేత బిగ్గెఁ బట్టుకొని
కడు నాపెచెవిలో నేకత మాడేవు
తడఁబడి వలపులు దండనుండి యిద్దరిలో
వడిసెఁ జెమటలు యెవ్వతెకుఁగా నయ్యా
(॥ఆసోద॥)
పంతమున నావమీదఁ పాదములు చాఁచుకొనే
పొంత నాపె చన్నులపైఁ బొరలేవు
బంతి నున్నారము నేము పచ్చిపులకలు మీకు
దొంతులాయ చెక్కులనే తొయ్యలికి నయ్యా
(॥ఆసోద॥)
కనుసన్నలనే నన్ను కందువ కౌఁగిటఁ గూడి
వెనక నాపెనుఁ గూడి వెస నవ్వేవు
ఘనుఁడ శ్రీవేంకటేశ కలగల పాయ మేలు
ఘనమాయ కళలు యేకతలకు నయ్యా
(||pallavi||)
āsodagām̐ḍavu nī vanniḍānu
ā suddule yaḍigi nī vānadiyyavayyā
(||āsoda||)
siḍimuḍi nāseyi seda biggĕm̐ baṭṭugŏni
kaḍu nābĕsĕvilo negada māḍevu
taḍam̐baḍi valabulu daṁḍanuṁḍi yiddarilo
vaḍisĕm̐ jĕmaḍalu yĕvvadĕgum̐gā nayyā
(||āsoda||)
paṁtamuna nāvamīdam̐ pādamulu sām̐sugŏne
pŏṁta nābĕ sannulabaim̐ bŏralevu
baṁti nunnāramu nemu pachchibulagalu mīgu
dŏṁtulāya sĕkkulane tŏyyaligi nayyā
(||āsoda||)
kanusannalane nannu kaṁduva kaum̐giḍam̐ gūḍi
vĕnaga nābĕnum̐ gūḍi vĕsa navvevu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kalagala pāya melu
ghanamāya kaḽalu yegadalagu nayyā