ఆసోదకాఁడవు అన్నిటికి నోపుదువు
(॥పల్లవి॥)
ఆసోదకాఁడవు అన్నిటికి నోపుదువు
మోసపోకుండా నీపై మూట గట్టేఁ జుమ్మీ
(॥ఆసో॥)
వెలవెట్టని వలపు వెస చల్లదుబ్బెఁడేసి
పొలసి గొల్లెతలెల్లాఁ బోసిరి నీకు
మలసి మామీఁదనట్టె మారుగొల గొలచేవు
కలిగినదెల్లా నీకే గాదెఁ బోసేఁ జుమ్మీ
(॥అసో॥)
సుంకము లేనివలపు సూటి చనుగుబ్బెఁడేసి
అంకెలఁ బదారువేలు అమ్మిరి నీకు
పొంకాన నదె తలపోసేవు నాతోను
పంకించక నీకన్నియుఁ బౌఁజు చూపేఁ జుమ్మీ
(॥అసో॥)
కొల్లవచ్చినవలపు కోరికెతో సందెఁడేసి
వల్లెవేసి యెనమండ్రు వంచిరి నీకు
యిల్లిదే యలమేలుమంగ నిదె నన్నూ నేలితివి
వొల్లనే శ్రీ వేంకటేశ వొడిగట్టే జుమ్మీ
(||pallavi||)
āsodagām̐ḍavu anniḍigi nobuduvu
mosaboguṁḍā nībai mūḍa gaṭṭem̐ jummī
(||āso||)
vĕlavĕṭṭani valabu vĕsa salladubbĕm̐ḍesi
pŏlasi gŏllĕdalĕllām̐ bosiri nīgu
malasi māmīm̐danaṭṭĕ mārugŏla gŏlasevu
kaliginadĕllā nīge gādĕm̐ bosem̐ jummī
(||aso||)
suṁkamu lenivalabu sūḍi sanugubbĕm̐ḍesi
aṁkĕlam̐ badāruvelu ammiri nīgu
pŏṁkāna nadĕ talabosevu nādonu
paṁkiṁchaga nīganniyum̐ baum̐ju sūbem̐ jummī
(||aso||)
kŏllavachchinavalabu korigĕdo saṁdĕm̐ḍesi
vallĕvesi yĕnamaṁḍru vaṁchiri nīgu
yillide yalamelumaṁga nidĕ nannū nelidivi
vŏllane śhrī veṁkaḍeśha vŏḍigaṭṭe jummī