Aasodabudaananannaa namtivigaani

ఆసోదపుదాననన్నా నంటివిగాని
Language

(॥పల్లవి॥)
ఆసోదపుదాననన్నా నంటివిగాని
పాసి వుండలేఁ జుమ్మీ పాయకుందు గాని

(॥ఆసో॥)
సారె నీతో మాటలాడి చాలించఁ చాల నేను
తేలించి యొక్కమాఁటే తీతుఁగాని
ఆలించి నీతోడి నవ్వు అలసియు మానలేదు
కేలిఁ దలఁచి తలఁచి కేరుదుఁగాని

(॥ఆసో॥)
తగిలి నీవద్దనుండి తనియెదు నా మనసు
సొగిసి నీమోము సారెఁ జూతుఁగాని
బిగువుఁగాఁగిట నిన్నుఁ బెనఁగియుఁ దమివోదు
అగవ డప్పటప్పటి కప్పళింతుఁగాని

(॥ఆసో॥)
గక్కన నీరతిఁ జొక్కి కంటికి నిద్దుర రాదు
పెక్కు రతిబంధములఁ బ్రేరేఁతుఁగాని
ఇక్కువ శ్రీవేంకటేశ ఇట్టె యెంత గూడినాను
అక్కరై నీమోవితేనె కాస గింతుఁ గాని

(||pallavi||)
āsodabudānanannā naṁṭivigāni
pāsi vuṁḍalem̐ jummī pāyaguṁdu gāni

(||āso||)
sārĕ nīdo māḍalāḍi sāliṁcham̐ sāla nenu
teliṁchi yŏkkamām̐ṭe tīdum̐gāni
āliṁchi nīdoḍi navvu alasiyu mānaledu
kelim̐ dalam̐si talam̐si kerudum̐gāni

(||āso||)
tagili nīvaddanuṁḍi taniyĕdu nā manasu
sŏgisi nīmomu sārĕm̐ jūdum̐gāni
biguvum̐gām̐giḍa ninnum̐ bĕnam̐giyum̐ damivodu
agava ḍappaḍappaḍi kappaḽiṁtum̐gāni

(||āso||)
gakkana nīradim̐ jŏkki kaṁṭigi niddura rādu
pĕkku radibaṁdhamulam̐ brerem̐tum̐gāni
ikkuva śhrīveṁkaḍeśha iṭṭĕ yĕṁta gūḍinānu
akkarai nīmovidenĕ kāsa giṁtum̐ gāni