Aasavetti yaamtadaani nalayimcharaadamduru

ఆసవెట్టి యాఁటదాని నలయించరాదందురు
Language

(॥పల్లవి॥)
ఆసవెట్టి యాఁటదాని నలయించరాదందురు
వేసరక వేడుకతో వినోదించరాదా

(॥ఆస॥)
పెనఁగుచుఁ గొసరీనిపెఁజెమట నీపైఁ గార
పనివడి యప్పటి గుబ్బల నొత్తీని
కనుచూపుల సొలసీ కడుఁ జుట్టరికముల
పొనుఁగ కాపెతోఁ గొంత పొందుసేయరాదా

(॥ఆస॥)
చెక్కునొక్కి వేఁడుకొనీ చేతులగోళ్ళు దాఁక
ముక్కు నిట్టూర్పుల సోఁక ముచ్చట చెప్పీ
మిక్కుటపుఁ గొప్పు వంచి మీఁగాళ్ళపై నీకు మొక్కీ
అక్కరదీరఁ గాఁగిట నలమరాదా

(॥ఆస॥)
చెప్పీఁ బ్రియములు తమ్మచెదరులు నినుఁ జెంద
కప్పీఁ బయ్యద నీకు కంకణాలు జీర
ఇప్పుడు శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
తప్పక చూచి యాపెనూఁ దగఁ బిలువరాదా

(||pallavi||)
āsavĕṭṭi yām̐ṭadāni nalayiṁcharādaṁduru
vesaraga veḍugado vinodiṁcharādā

(||āsa||)
pĕnam̐gusum̐ gŏsarīnibĕm̐jĕmaḍa nībaim̐ gāra
panivaḍi yappaḍi gubbala nŏttīni
kanusūbula sŏlasī kaḍum̐ juṭṭarigamula
pŏnum̐ga kābĕdom̐ gŏṁta pŏṁduseyarādā

(||āsa||)
sĕkkunŏkki vem̐ḍugŏnī sedulagoḽḽu dām̐ka
mukku niṭṭūrbula som̐ka muchchaḍa sĕppī
mikkuḍabum̐ gŏppu vaṁchi mīm̐gāḽḽabai nīgu mŏkkī
akkaradīram̐ gām̐giḍa nalamarādā

(||āsa||)
sĕppīm̐ briyamulu tammasĕdarulu ninum̐ jĕṁda
kappīm̐ bayyada nīgu kaṁkaṇālu jīra
ippuḍu śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
tappaga sūsi yābĕnūm̐ dagam̐ biluvarādā