ఆసమీఁద విసుపౌ(వౌ) దాఁక యీ
(॥పల్లవి॥)
ఆసమీఁద విసుపౌ(వౌ) దాఁక యీ-
గాసిఁ బరచు తన కపటమే సుఖము
(॥ఆస॥)
తిరమగుఁ కర్మము దెగుదాఁక తన-
గరిమ సుఖము పొగడునందాఁక
పరమార్గం బగపడుదాఁక తన-
పరితాపపు లంపటమే సుఖము
(॥ఆస॥)
కాయము గడపల గనుదాఁక యీ
మాయ దన్ను వెడమరుదాఁక
రాయడి మదము గరఁగుదాఁక యీ-
రోయఁదగిన తనరూపమే సుఖము
(॥ఆస॥)
లంకెలఁ బొరలి నలఁగుదాఁక యీ
యంకెల భవము లెరవౌదాఁక
వేంకటపతిఁ దడవిన దాఁక యీ
కింకురువాణపు గెలుపే సుఖము
(||pallavi||)
āsamīm̐da visubau(vau) dām̐ka yī-
gāsim̐ barasu tana kabaḍame sukhamu
(||āsa||)
tiramagum̐ karmamu dĕgudām̐ka tana-
garima sukhamu pŏgaḍunaṁdām̐ka
paramārgaṁ bagabaḍudām̐ka tana-
paridābabu laṁpaḍame sukhamu
(||āsa||)
kāyamu gaḍabala ganudām̐ka yī
māya dannu vĕḍamarudām̐ka
rāyaḍi madamu garam̐gudām̐ka yī-
royam̐dagina tanarūbame sukhamu
(||āsa||)
laṁkĕlam̐ bŏrali nalam̐gudām̐ka yī
yaṁkĕla bhavamu lĕravaudām̐ka
veṁkaḍabadim̐ daḍavina dām̐ka yī
kiṁkuruvāṇabu gĕlube sukhamu