Aasalunu resulanu avi remdu nele

ఆసలును రేసులను అవి రెండు నేలే
Language

(॥పల్లవి॥)
ఆసలును రేసులను అవి రెండు నేలే
కాసు సేయనిపనికి కాఁతాళ మేలే

(॥అలును॥)
అలిగినవాఁడు తా నారడనే వుండుఁ గాక
పిలిచి వాదుకు వచ్చి పెనఁగ నేలే
కలయనివాఁడు తాను కడు వాసి నుండుఁ గాక
వొలిసి దగ్గరి తగవుకుఁ దియ్య నేలే

(॥ఆలును॥)
మాటలాడనివాఁడు తా మారుమో మై వుండుఁ గాక
తేటలుగా సారె మమ్ముఁ దిట్టఁగ నేలే
నీటున నుండెటివాఁడు నిక్కము బిగుసుఁ గాక
చీటికి మాటికి మాపైఁ జెయి చాఁచ నేలే

(॥ఆలును॥)
కాఁకలు సేసెటివాఁడు కన్నులనె చూచుఁ గాక
యేఁకటఁ గాఁగిలించీ నన్నింతలో నేలే
వేఁకపు శ్రీవెంకటాద్రివిభుఁ డిట్టె నన్నుఁ గూడె
మాఁకువలె నన్ను మేను మరపించ నేలే

(||pallavi||)
āsalunu resulanu avi rĕṁḍu nele
kāsu seyanibanigi kām̐tāḽa mele

(||alunu||)
aliginavām̐ḍu tā nāraḍane vuṁḍum̐ gāga
pilisi vādugu vachchi pĕnam̐ga nele
kalayanivām̐ḍu tānu kaḍu vāsi nuṁḍum̐ gāga
vŏlisi daggari tagavugum̐ diyya nele

(||ālunu||)
māḍalāḍanivām̐ḍu tā mārumo mai vuṁḍum̐ gāga
teḍalugā sārĕ mammum̐ diṭṭam̐ga nele
nīḍuna nuṁḍĕḍivām̐ḍu nikkamu bigusum̐ gāga
sīḍigi māḍigi mābaim̐ jĕyi sām̐sa nele

(||ālunu||)
kām̐kalu sesĕḍivām̐ḍu kannulanĕ sūsum̐ gāga
yem̐kaḍam̐ gām̐giliṁchī nanniṁtalo nele
vem̐kabu śhrīvĕṁkaḍādrivibhum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
mām̐kuvalĕ nannu menu marabiṁcha nele