Aasalane badalidi natte raavayya

ఆసలనే బడలితి నట్టె రావయ్య
Language

(॥పల్లవి॥)
ఆసలనే బడలితి నట్టె రావయ్య
యీసులేదు నీకు నాకు నింటికి రావయ్యా

(॥ఆస॥)
మొగమెల్లఁ జెమరించె మంచి నీపై తమకాన
తగవులఁబెట్టక ఇంతట రావయ్య
చిగిరించె చిత్తమును చెక్కునఁ జేయి మోఁచె
యొగసక్కేలు సేయ ఇంటికి రావయ్యా

(॥ఆస॥)
చెక్కులెల్ బలకించ చెలువపునిన్నుఁ జూచి
తక్కులఁబెట్టక ఇంతట రావయ్య
ముక్కున నూర్పుల ముంచె ముంగురులు కడుజారె
యెక్కువతక్కువ లంచ కింటికి రావయ్యా

(॥ఆస॥)
శిరసునెరులు జారె సిగ్గుల పలచనాయ
తరితీపులేల ఇంతట రావయ్య
గరిమశ్రీవేంకటేశ కలసితి విక్కడనె
యిరవైతి వింక మా యంటికి రావయ్యా

(||pallavi||)
āsalane baḍalidi naṭṭĕ rāvayya
yīsuledu nīgu nāgu niṁṭigi rāvayyā

(||āsa||)
mŏgamĕllam̐ jĕmariṁchĕ maṁchi nībai tamagāna
tagavulam̐bĕṭṭaga iṁtaḍa rāvayya
sigiriṁchĕ sittamunu sĕkkunam̐ jeyi mom̐sĕ
yŏgasakkelu seya iṁṭigi rāvayyā

(||āsa||)
sĕkkulĕl balagiṁcha sĕluvabuninnum̐ jūsi
takkulam̐bĕṭṭaga iṁtaḍa rāvayya
mukkuna nūrbula muṁchĕ muṁgurulu kaḍujārĕ
yĕkkuvadakkuva laṁcha kiṁṭigi rāvayyā

(||āsa||)
śhirasunĕrulu jārĕ siggula palasanāya
taridībulela iṁtaḍa rāvayya
garimaśhrīveṁkaḍeśha kalasidi vikkaḍanĕ
yiravaidi viṁka mā yaṁṭigi rāvayyā