(॥పల్లవి॥)
ఆసలఁబెట్టి యేల అలయించేవు
పోసరించఁజేసి యిట్టె భోగించరాదా
(॥ఆ॥)
కేలుఁగేలు గీలించి కెరలింపుమాటలాడి
చేలకొంగువట్టి చెలిఁ జిమ్మిరేఁచేవు
మేలములు వచరించి మేనెల్లాఁ జెమరింపించి
నాలిసేసి యంతలోనే నవ్వులు నవ్వేవు
(॥ఆ॥)
విందులమోవి మోపి వేడుక నోరూరించి
కందులవంటి మనసు గరఁగించేవు
పొందులసాములు సేసి పులకలు వుట్టించి
పందేలు వేయుచును తప్పకచూచేవు
(॥ఆ॥)
సరుసనే నిలుచుండి చన్నులపై నొరగుచు
సురతపు విద్యలను చొక్కించేవు
అరిది శ్రీవేంకటేశ అలమేలుమంగఁ గూడి
తెరవేసుక తెప్పలఁదేలించేవు
(||pallavi||)
āsalam̐bĕṭṭi yela alayiṁchevu
posariṁcham̐jesi yiṭṭĕ bhogiṁcharādā
(||ā||)
kelum̐gelu gīliṁchi kĕraliṁpumāḍalāḍi
selagŏṁguvaṭṭi sĕlim̐ jimmirem̐sevu
melamulu vasariṁchi menĕllām̐ jĕmariṁpiṁchi
nālisesi yaṁtalone navvulu navvevu
(||ā||)
viṁdulamovi mobi veḍuga norūriṁchi
kaṁdulavaṁṭi manasu garam̐giṁchevu
pŏṁdulasāmulu sesi pulagalu vuṭṭiṁchi
paṁdelu veyusunu tappagasūsevu
(||ā||)
sarusane nilusuṁḍi sannulabai nŏragusu
suradabu vidyalanu sŏkkiṁchevu
aridi śhrīveṁkaḍeśha alamelumaṁgam̐ gūḍi
tĕravesuga tĕppalam̐deliṁchevu