(॥పల్లవి॥)
ఆసల నాలో నవె గుబ్బతిలఁగ
దోసము నీకే తరలీఁ జుమ్మీ
(॥ఆల॥)
కామించి నే నిన్నుఁ గలయఁగ వచ్చిన
ప్రేమపు సిగ్గునఁ బెనఁగేవు
వాములైన నా వలపులు నీపై
భామరో వడ్డికిఁ బారీఁ జుమ్మీ
(॥ఆల॥)
చిడుముడి నే నినుఁ జెనకుచు నంటిన
వెడగిలిగింతల వీఁగేవు
బడి బడి నాలోపలితలపోఁతలు
తడయక నిను గురిదాఁకీఁ జుమ్మీ
(॥ఆల॥)
కందువ నే నినుఁ గాఁగిట నించిన
మందలించి మై మఱచేవు
యిందునె శ్రీవేంకటేశుఁడ నే నినుఁ
బొందితి నివి నినుఁ బోనీవు మ్మీ
(||pallavi||)
āsala nālo navĕ gubbadilam̐ga
dosamu nīge taralīm̐ jummī
(||āla||)
kāmiṁchi ne ninnum̐ galayam̐ga vachchina
premabu siggunam̐ bĕnam̐gevu
vāmulaina nā valabulu nībai
bhāmaro vaḍḍigim̐ bārīm̐ jummī
(||āla||)
siḍumuḍi ne ninum̐ jĕnagusu naṁṭina
vĕḍagiligiṁtala vīm̐gevu
baḍi baḍi nālobalidalabom̐talu
taḍayaga ninu guridām̐kīm̐ jummī
(||āla||)
kaṁduva ne ninum̐ gām̐giḍa niṁchina
maṁdaliṁchi mai maṟasevu
yiṁdunĕ śhrīveṁkaḍeśhum̐ḍa ne ninum̐
bŏṁdidi nivi ninum̐ bonīvu mmī