ఆసగదా మోసపుచ్చె నయ్యా న న్నింతగాను
(॥పల్లవి॥)
ఆసగదా మోసపుచ్చె నయ్యా న న్నింతగాను
వాసుల వలపులనే వలలఁ జిక్కితిని
(॥ఆసగదా॥)
యెనసి లోనికిఁ బోక యెప్పుడు వత్తువో యంట
కనురెప్ప వెట్ట కట్టె కాచుకుండితి
నినువుచంద్రోదయము నీ పంజువెలుఁ గంటాఁ
గని యంతలోఁ దెలిసి కళవళించితిని
(॥ఆసగదా॥)
చీమ చిటు కననీక చెలి పిలుతువో యంటా
ఆముకొని దిక్కులెల్లా నాలకించితి
ప్రేమపు నెమలికూఁత పిలిచేవు నీ వంటా
దీమసాన నూఁకొని తెలిసి లోఁగితిని
(॥ఆసగదా॥)
మనసు నీవద్ది కంపి మాఁకువలెఁ బానుపుపై
చెనకె శ్రీవేంకటేశ చెంది కూడితి
తనివోక నా నీడ తగు నీచెక్కునఁ జూచి
కొనగోర నూఁదిపట్టి గొబ్బునఁ దీసితిని
(||pallavi||)
āsagadā mosabuchchĕ nayyā na nniṁtagānu
vāsula valabulane valalam̐ jikkidini
(||āsagadā||)
yĕnasi lonigim̐ boga yĕppuḍu vattuvo yaṁṭa
kanurĕppa vĕṭṭa kaṭṭĕ kāsuguṁḍidi
ninuvusaṁdrodayamu nī paṁjuvĕlum̐ gaṁṭām̐
gani yaṁtalom̐ dĕlisi kaḽavaḽiṁchidini
(||āsagadā||)
sīma siḍu kananīga sĕli piluduvo yaṁṭā
āmugŏni dikkulĕllā nālagiṁchidi
premabu nĕmaligūm̐ta pilisevu nī vaṁṭā
dīmasāna nūm̐kŏni tĕlisi lom̐gidini
(||āsagadā||)
manasu nīvaddi kaṁpi mām̐kuvalĕm̐ bānububai
sĕnagĕ śhrīveṁkaḍeśha sĕṁdi kūḍidi
tanivoga nā nīḍa tagu nīsĕkkunam̐ jūsi
kŏnagora nūm̐dibaṭṭi gŏbbunam̐ dīsidini