Aasagaa nevvarigaina naddabettaraanidi

ఆసగా నెవ్వరికైన నడ్డపెట్టరానిది
Language

(॥పల్లవి॥)
ఆసగా నెవ్వరికైన నడ్డపెట్టరానిది
పోసరించె నా వలపు పొంచి పొంచి నిన్నును

(॥ఆస॥)
తీపులనీమాటలనే తేలి తేలి చొక్కి చొక్కి
మాపుదాఁకా నీవద్ద మరిగుంటిని
యేపొద్దు గరుణించేవో యింటి కెన్నఁడు వచ్చేవో
మూపులు మూఁడాయి నీమోము చూచి నాకు

(॥ఆస॥)
వేడుక నీపసలకే వెంట వెంటఁ గాచి కాచి
తోడు నీడై నే నీతో దొరసితిని
కూడేటివేళ యెప్పుడో గురి యిందు మోఁచీనో
వాడు దేరితిమి నీవారమైనయపుడే

(॥ఆస॥)
చేత నీవంటినందుకే చిక్కి చిక్కి మొక్కి మొక్కి
కాతరపు నీకాఁగిటఁ గలసితిని
యీతల శ్రీవేంకటేశ యిఁక నీచిత్తమెట్లో
పోతరించి నీరతుల పొందులనే మెచ్చితిని

(||pallavi||)
āsagā nĕvvarigaina naḍḍabĕṭṭarānidi
posariṁchĕ nā valabu pŏṁchi pŏṁchi ninnunu

(||āsa||)
tībulanīmāḍalane teli teli sŏkki sŏkki
mābudām̐kā nīvadda mariguṁṭini
yebŏddu garuṇiṁchevo yiṁṭi kĕnnam̐ḍu vachchevo
mūbulu mūm̐ḍāyi nīmomu sūsi nāgu

(||āsa||)
veḍuga nībasalage vĕṁṭa vĕṁṭam̐ gāsi kāsi
toḍu nīḍai ne nīdo dŏrasidini
kūḍeḍiveḽa yĕppuḍo guri yiṁdu mom̐sīno
vāḍu deridimi nīvāramainayabuḍe

(||āsa||)
seda nīvaṁṭinaṁduge sikki sikki mŏkki mŏkki
kādarabu nīgām̐giḍam̐ galasidini
yīdala śhrīveṁkaḍeśha yim̐ka nīsittamĕṭlo
podariṁchi nīradula pŏṁdulane mĕchchidini