Aasabaduduru neegu namganalu ganumgoni

ఆసపడుదురు నీకు నంగనలు గనుఁగొని
Language

(॥పల్లవి॥)
ఆసపడుదురు నీకు నంగనలు గనుఁగొని
దోసముగా దందులకు దొరవైతేనేమి

(॥ఆస॥)
యెనలేని మోహమున నెవ్వతైనా సొలయును
మనసిచ్చి యెవ్వతైనా మాటలాడును
ననుపున నెవ్వతైనా నవ్వఁజూచు నీతోను
వినయము సేయదంటా వెనఁ గోపించకుమీ

(॥ఆస॥)
దంటయైనది యొకతె తమకించు నీకుఁ గాను
వొంటి నుండితే నొకతె యొడివట్టును
అంటి చన్నులనే వొత్తు నండనేయుండి యొకతె
ఇంటిలోనే మొక్కదంటా నెగ్గులు పట్టకుమీ

(॥ఆస॥)
బత్తిగలజవరాలు పైకొని చెనకును
అత్తుకొన్న ముద్దరుల ఆయము లంటు
ఇత్తల శ్రీవేంకటేశ యే నలమేలు మంగను
సత్తుగా నీయాలనైతి సాదించెననకుమీ

(||pallavi||)
āsabaḍuduru nīgu naṁganalu ganum̐gŏni
dosamugā daṁdulagu dŏravaidenemi

(||āsa||)
yĕnaleni mohamuna nĕvvadainā sŏlayunu
manasichchi yĕvvadainā māḍalāḍunu
nanubuna nĕvvadainā navvam̐jūsu nīdonu
vinayamu seyadaṁṭā vĕnam̐ gobiṁchagumī

(||āsa||)
daṁṭayainadi yŏgadĕ tamagiṁchu nīgum̐ gānu
vŏṁṭi nuṁḍide nŏgadĕ yŏḍivaṭṭunu
aṁṭi sannulane vŏttu naṁḍaneyuṁḍi yŏgadĕ
iṁṭilone mŏkkadaṁṭā nĕggulu paṭṭagumī

(||āsa||)
battigalajavarālu paigŏni sĕnagunu
attugŏnna muddarula āyamu laṁṭu
ittala śhrīveṁkaḍeśha ye nalamelu maṁganu
sattugā nīyālanaidi sādiṁchĕnanagumī