ఆసపడి వచ్చె నాఁటదానిఁ దోయ
(॥పల్లవి॥)
ఆసపడి వచ్చె నాఁటదానిఁ దోయ
దోసమేల యీపెఁ జేసుకోవయ్యా
(॥॥)
కందువ చూపీని కానుక లిచ్చీని
విందులు చెప్పీని వెలఁది
యిందరిలో సిగ్గులేల పచరించ
పొందులు సేసుక భోగించవయ్యా
(॥॥)
సన్నలు చేసీని చవులు చూపీని
కన్నుల మొక్కీని కలికి
మున్నిటి వలపు మూసి దాఁచనేల
యిన్నిట నాకెను యియ్యకోవయ్యా
(॥॥)
శ్రీవేంకటేశ్వర సేవలు చేసీని
పూవుల వేసీని పొలఁతి
యీవల నన్నేలి తిఁకఁ గొంక నేల
భావించాపెఁ గూడి బదుకవయ్యా
(||pallavi||)
āsabaḍi vachchĕ nām̐ṭadānim̐ doya
dosamela yībĕm̐ jesugovayyā
(||||)
kaṁduva sūbīni kānuga lichchīni
viṁdulu sĕppīni vĕlam̐di
yiṁdarilo siggulela pasariṁcha
pŏṁdulu sesuga bhogiṁchavayyā
(||||)
sannalu sesīni savulu sūbīni
kannula mŏkkīni kaligi
munniḍi valabu mūsi dām̐sanela
yinniḍa nāgĕnu yiyyagovayyā
(||||)
śhrīveṁkaḍeśhvara sevalu sesīni
pūvula vesīni pŏlam̐ti
yīvala nanneli tim̐kam̐ gŏṁka nela
bhāviṁchābĕm̐ gūḍi badugavayyā