Aasabadi vaasulemcha nadi yemtige

ఆసపడి వాసులెంచ నది యేఁటికే
Language

(॥పల్లవి॥)
ఆసపడి వాసులెంచ నది యేఁటికే
పాసి వుండలేనివాఁడు పదరఁగ నేఁటికే

(॥ఆస॥)
తప్పక చూచినవాఁడు దండకు రావలెఁగాక
చిప్పిలఁ గలలోనేసిగ్గులేఁటికే
కొప్పు దువ్వినవాఁడు యిక్కువ లంటవలెఁగాక
దప్పిదేరెమోవితోడ తలవంచ నేఁటికే

(॥ఆస॥)
మేలమాడినవాఁడు కామించి కూడవలెఁగాక
యీలాగు సెలవినవ్వు లిపుడేఁటికే
కాలుదొక్కిన వాఁ డిట్టె కరఁ గించవలఁగాక
తాలిమితోసారెసారెఁ దలపోఁత లేఁటికే

(॥ఆస॥)
చేరి పెండ్లాడినవాఁడు చెనకఁగవలెఁగాక
ఆరీతి కాఁకలనలయఁగ నేఁటికే
వూరకె శ్రీ వేంకటేశుఁడొద్దికతో నన్నుఁ గూడె
తారసిలె వలపులు తడఁబాటులేఁటికే

(||pallavi||)
āsabaḍi vāsulĕṁcha nadi yem̐ṭige
pāsi vuṁḍalenivām̐ḍu padaram̐ga nem̐ṭige

(||āsa||)
tappaga sūsinavām̐ḍu daṁḍagu rāvalĕm̐gāga
sippilam̐ galalonesiggulem̐ṭige
kŏppu duvvinavām̐ḍu yikkuva laṁṭavalĕm̐gāga
dappiderĕmovidoḍa talavaṁcha nem̐ṭige

(||āsa||)
melamāḍinavām̐ḍu kāmiṁchi kūḍavalĕm̐gāga
yīlāgu sĕlavinavvu libuḍem̐ṭige
kāludŏkkina vām̐ ḍiṭṭĕ karam̐ giṁchavalam̐gāga
tālimidosārĕsārĕm̐ dalabom̐ta lem̐ṭige

(||āsa||)
seri pĕṁḍlāḍinavām̐ḍu sĕnagam̐gavalĕm̐gāga
ārīdi kām̐kalanalayam̐ga nem̐ṭige
vūragĕ śhrī veṁkaḍeśhum̐ḍŏddigado nannum̐ gūḍĕ
tārasilĕ valabulu taḍam̐bāḍulem̐ṭige