Aasabaddavaarini alayimturaa

ఆసపడ్డవారిని అలయింతురా
Language

(॥పల్లవి॥)
ఆసపడ్డవారిని అలయింతురా
పోసరించి యేల జరవులఁ బెట్టేవికను

(॥॥)
కన్నులనే మొక్కితి కైదండ నీ కిచ్చితి
విన్నపములు సేసితి వేమారును
యెన్నుక యింతటనైనా ఇంటికి రారాదా
సన్నల నెందాకా రచ్చల సేసే విచ్చట

(॥॥)
సేవలెల్లా జేసితి చెక్కులు నేనొక్కితి
వేవేలకు గొసరితి వేమారును
చేవదేర మంచముపై జేరి కూచుండరాదా
తోవల చెలులతో సుద్దు లేమిటి కిపుడు

(॥॥)
కందువ లిట్టేయంటితి కాగిలించు కొంటిని
విందుగా శ్రీ వేంకటేశ వేమారును
పందెము లేమాడేవు పవ్వళించరాదా
చెందితివి నన్ను నేఁడుఁ చింతలు మరేఁటికి

(||pallavi||)
āsabaḍḍavārini alayiṁturā
posariṁchi yela jaravulam̐ bĕṭṭeviganu

(||||)
kannulane mŏkkidi kaidaṁḍa nī kichchidi
vinnabamulu sesidi vemārunu
yĕnnuga yiṁtaḍanainā iṁṭigi rārādā
sannala nĕṁdāgā rachchala sese vichchaḍa

(||||)
sevalĕllā jesidi sĕkkulu nenŏkkidi
vevelagu gŏsaridi vemārunu
sevadera maṁchamubai jeri kūsuṁḍarādā
tovala sĕlulado suddu lemiḍi kibuḍu

(||||)
kaṁduva liṭṭeyaṁṭidi kāgiliṁchu kŏṁṭini
viṁdugā śhrī veṁkaḍeśha vemārunu
paṁdĕmu lemāḍevu pavvaḽiṁcharādā
sĕṁdidivi nannu nem̐ḍum̐ siṁtalu marem̐ṭigi