(॥పల్లవి॥)
ఆసపడ్డవారికి నడ్డమేడది
వాసుల సిగ్గులతోడ వడఁబడనేఁటికి
(॥ఆస॥)
తప్పక చూచితే నీవు తలవంచుకొనెఁ జెలి
యిప్పటి మీలోనిసుద్దు లేఁటివోకాని
చెప్పరాదా మాకు నవి చిక్కులు వాపేముగాని
దప్పిదేరే మోవులతో తడఁబడ నేటికి
(॥ఆస॥)
నీవు మాటలాడఁ గాను నెలఁత తో మాటలాడీ
యేవేళ నీ వాపె నేమంటివో
చెవదేర నవ్వరాదా చెలఁగఁ జేసేము గాని
వేవేలు సణఁగుల వేసరఁగ నేటికి
(॥ఆస॥)
కొంగువట్టి తియ్యఁగాను కొనగోర నదిమీని
యింగితాకారాలు మీకు నెటువంటివో
అంగమించి కూడితిరి అట్టె శ్రీవేంకటేశ
కంగ కిట్టె వుండరాదా కడుజంకె లేఁటికి
(||pallavi||)
āsabaḍḍavārigi naḍḍameḍadi
vāsula sigguladoḍa vaḍam̐baḍanem̐ṭigi
(||āsa||)
tappaga sūside nīvu talavaṁchugŏnĕm̐ jĕli
yippaḍi mīlonisuddu lem̐ṭivogāni
sĕpparādā māgu navi sikkulu vābemugāni
dappidere movulado taḍam̐baḍa neḍigi
(||āsa||)
nīvu māḍalāḍam̐ gānu nĕlam̐ta to māḍalāḍī
yeveḽa nī vābĕ nemaṁṭivo
sĕvadera navvarādā sĕlam̐gam̐ jesemu gāni
vevelu saṇam̐gula vesaram̐ga neḍigi
(||āsa||)
kŏṁguvaṭṭi tiyyam̐gānu kŏnagora nadimīni
yiṁgidāgārālu mīgu nĕḍuvaṁṭivo
aṁgamiṁchi kūḍidiri aṭṭĕ śhrīveṁkaḍeśha
kaṁga kiṭṭĕ vuṁḍarādā kaḍujaṁkĕ lem̐ṭigi