Aasabadda selulagu naadurabamdhumdu taanu

ఆసపడ్డ చెలులకు నాతురబంధుఁడు తాను
Language

(॥పల్లవి॥)
ఆసపడ్డ చెలులకు నాతురబంధుఁడు తాను
రాసికెక్క నింతలోనే రావద్దా తాను

(॥ఆస॥)
పెక్కుమారులు తను నేఁ బేరుకొని పిలువఁగా
పక్కున నారమణుఁడు పలుకవద్దా
దిక్కులనెల్లా నేను తేరకొని వెదకఁగా
చొక్కఁగఁ దనరూపము చూపఁగవద్దా

(॥ఆస॥)
అసురుసురై తన్ను నటు నేఁ దలఁచఁగాను
వెస నాచన్నులపైఁ జేఇ వేయవద్దా
కొసరి తనపొందులు కోరుకొనివుండఁగాను
ముసిపిదీర మాఁటలు ముంచియాడవద్దా

(॥ఆస॥)
వెలలేని జవ్వననా వేడుకపడి వుండఁగా
కలసి కాఁగిట నన్నుఁగై కొనవద్దా
అలరి శ్రీవేంకటేశుఁ డంతలో నన్నిదె కూడె
మలసి యెప్పుడు నిట్టె మన్నించవద్దా

(||pallavi||)
āsabaḍḍa sĕlulagu nādurabaṁdhum̐ḍu tānu
rāsigĕkka niṁtalone rāvaddā tānu

(||āsa||)
pĕkkumārulu tanu nem̐ berugŏni piluvam̐gā
pakkuna nāramaṇum̐ḍu palugavaddā
dikkulanĕllā nenu teragŏni vĕdagam̐gā
sŏkkam̐gam̐ danarūbamu sūbam̐gavaddā

(||āsa||)
asurusurai tannu naḍu nem̐ dalam̐sam̐gānu
vĕsa nāsannulabaim̐ jei veyavaddā
kŏsari tanabŏṁdulu korugŏnivuṁḍam̐gānu
musibidīra mām̐ṭalu muṁchiyāḍavaddā

(||āsa||)
vĕlaleni javvananā veḍugabaḍi vuṁḍam̐gā
kalasi kām̐giḍa nannum̐gai kŏnavaddā
alari śhrīveṁkaḍeśhum̐ ḍaṁtalo nannidĕ kūḍĕ
malasi yĕppuḍu niṭṭĕ manniṁchavaddā