ఆచార్యుఁ డొక్కఁడే యదె నీకు నొప్పగించె
(॥పల్లవి॥)
ఆచార్యుఁ డొక్కఁడే యదె నీకు నొప్పగించె
నేచి నన్ను రక్షించేది యిఁక నీ చేతిది
(॥ఆచా॥)
వరుసఁ బుణ్యము లెల్లా స్వర్గమున కొప్పగించు
సరుసనే చదువులు సంశయముల కొప్పించు
సురలఁ బూజించుపూజ క్షుద్రవిద్యల కొప్పించు
కెరలి నీ కృప కొప్పగించ నెవ్వరు లేరు
(॥ఆచా॥)
ఘనసంకల్పములు భోగములకు నొప్పగించు
పొనిగి కర్మము లెల్లా పుట్టుగుల కొప్పగించు
ధనము లంపటముల తగులున కొప్పగించు
కినిసి నీ సేవ కొప్పగించ నెవ్వరు లేరు
(॥ఆచా॥)
సారె నేర్చిన నేర్పులు సంసారమున కొప్పించు
అరయఁ గోరికె లెల్లా నజ్ఞానమున కొప్పించు
ధారుణి శ్రీవేంకటేశ తగ నన్ను నేలితివి
కేరి నీ దాస్యాన కొప్పగించ నెవ్వరు లేరు
(||pallavi||)
āsāryum̐ ḍŏkkam̐ḍe yadĕ nīgu nŏppagiṁchĕ
nesi nannu rakṣhiṁchedi yim̐ka nī sedidi
(||āsā||)
varusam̐ buṇyamu lĕllā svargamuna kŏppagiṁchu
sarusane saduvulu saṁśhayamula kŏppiṁchu
suralam̐ būjiṁchubūja kṣhudravidyala kŏppiṁchu
kĕrali nī kṛpa kŏppagiṁcha nĕvvaru leru
(||āsā||)
ghanasaṁkalbamulu bhogamulagu nŏppagiṁchu
pŏnigi karmamu lĕllā puṭṭugula kŏppagiṁchu
dhanamu laṁpaḍamula taguluna kŏppagiṁchu
kinisi nī seva kŏppagiṁcha nĕvvaru leru
(||āsā||)
sārĕ nersina nerbulu saṁsāramuna kŏppiṁchu
arayam̐ gorigĕ lĕllā najñānamuna kŏppiṁchu
dhāruṇi śhrīveṁkaḍeśha taga nannu nelidivi
keri nī dāsyāna kŏppagiṁcha nĕvvaru leru