Aarasi verogaso muktadugamgavaladu

ఆరసి వేరొకచో ముక్తడుగఁగవలదు
Language

(॥పల్లవి॥)
ఆరసి వేరొకచో ముక్తడుగఁగవలదు
సారపు లౌకికవిమోచనమే ముక్తి

(॥ఆర॥)
మొగిఁ బుణ్యపాపవిముక్తియే ముక్తి
వెగటుఁ బ్రపంచపువిముక్తే ముక్తి
తగులు సంసారబంధవిముక్తే ముక్తి
జగములోఁ గలుగు యాశాముక్తే ముక్తి

(॥ఆర॥)
కామక్రోధాదిసంగ విముక్తే ముక్తి
వేమారు రుచులపై విముక్తే ముక్తి
నాముల దేహభిమానపు ముక్తే ముక్తి
పామెడి కోరికలసంపద ముక్తే ముక్తి

(॥ఆర॥)
ముందువెనకల కర్మమోచనమే ముక్తి
అంది సుఖదుఃఖభయ ముక్తే ముక్తి
కందువ శ్రీవేంకటేశుఁ గని యందే శరణని
విందుల నితరసేవావిముక్తే ముక్తి

(||pallavi||)
ārasi verŏgaso muktaḍugam̐gavaladu
sārabu laugigavimosaname mukti

(||āra||)
mŏgim̐ buṇyabābavimuktiye mukti
vĕgaḍum̐ brabaṁchabuvimukte mukti
tagulu saṁsārabaṁdhavimukte mukti
jagamulom̐ galugu yāśhāmukte mukti

(||āra||)
kāmakrodhādisaṁga vimukte mukti
vemāru rusulabai vimukte mukti
nāmula dehabhimānabu mukte mukti
pāmĕḍi korigalasaṁpada mukte mukti

(||āra||)
muṁduvĕnagala karmamosaname mukti
aṁdi sukhaduḥkhabhaya mukte mukti
kaṁduva śhrīveṁkaḍeśhum̐ gani yaṁde śharaṇani
viṁdula nidarasevāvimukte mukti