ఆరంగఁ జూడరే అదె కృష్ణమహిమలు
(॥పల్లవి॥)
ఆరంగఁ జూడరే అదె కృష్ణమహిమలు
కూరిమి మించిన గోపికలు
(॥అరం॥)
కొట్టేటివుట్లు కోలలగుంపులు
గుట్టులఁ బొంచెడి గోపాలులు
అట్టులుఁ బండ్లు నట్టె చక్కిలాలు
చుట్టుల నెక్కడ చూచినను
(॥అరం॥)
యేఁగేటి వీధులు యిండ్లిండ్ల వాకిళ్ల
వాఁగే పంచమహావాద్యములు
దాఁగిలి ముచ్చిమిఁ ద్రావేటి పాలును
చేఁగదేరీనెందు చేయిచాఁచినా
(॥అరం॥)
కారేటి జున్నులు గడ్డపెరుగులు
వారలువట్టేటి వైపులును
యీరీతి శ్రీవేంకటేశుని సన్నిది
ఆరితేరె నెంద నరసినను
(||pallavi||)
āraṁgam̐ jūḍare adĕ kṛṣhṇamahimalu
kūrimi miṁchina gobigalu
(||araṁ||)
kŏṭṭeḍivuṭlu kolalaguṁpulu
guṭṭulam̐ bŏṁchĕḍi gobālulu
aṭṭulum̐ baṁḍlu naṭṭĕ sakkilālu
suṭṭula nĕkkaḍa sūsinanu
(||araṁ||)
yem̐geḍi vīdhulu yiṁḍliṁḍla vāgiḽla
vām̐ge paṁchamahāvādyamulu
dām̐gili muchchimim̐ drāveḍi pālunu
sem̐gaderīnĕṁdu seyisām̐sinā
(||araṁ||)
kāreḍi junnulu gaḍḍabĕrugulu
vāraluvaṭṭeḍi vaibulunu
yīrīdi śhrīveṁkaḍeśhuni sannidi
āriderĕ nĕṁda narasinanu