(॥పల్లవి॥)
ఆరజమేల సేసే వట్టే కాదా
యేరా ముందటిపొందు లిట్టేకాదా
(॥ఆర॥)
కన్నులసన్నలు గొంత కమ్మటినానలు గొంత
అన్నిటా నీవే జాణఁడ వట్టే కాదా
పన్ని వినయాలు గొంత బలిమిచేఁతలు గొంత
యెన్నికాయ నీతగవు యిట్టేకాదా
(॥ఆర॥)
ముసిముసినవ్వు గొంత ముంగిటనే జోలి గొంత
అసుదా నే నీకింత అట్టే కాదా
అసురుసురులు గొంత ఆయము లంటేది గొంత
యిసుమంతపనికిఁగా నిట్టేకాదా
(॥ఆర॥)
మోవి యానేది గొంత ముంటిపోట్లునుఁ గొంత
అవటమాయ నీకు నట్టే కాదా
శ్రీవేంకటేశ నన్ను సేసవెట్టి కూడితివి
యేవేళ నీమోహ మిట్టేకాదా
(||pallavi||)
ārajamela sese vaṭṭe kādā
yerā muṁdaḍibŏṁdu liṭṭegādā
(||āra||)
kannulasannalu gŏṁta kammaḍinānalu gŏṁta
anniḍā nīve jāṇam̐ḍa vaṭṭe kādā
panni vinayālu gŏṁta balimisem̐talu gŏṁta
yĕnnigāya nīdagavu yiṭṭegādā
(||āra||)
musimusinavvu gŏṁta muṁgiḍane joli gŏṁta
asudā ne nīgiṁta aṭṭe kādā
asurusurulu gŏṁta āyamu laṁṭedi gŏṁta
yisumaṁtabanigim̐gā niṭṭegādā
(||āra||)
movi yānedi gŏṁta muṁṭiboṭlunum̐ gŏṁta
avaḍamāya nīgu naṭṭe kādā
śhrīveṁkaḍeśha nannu sesavĕṭṭi kūḍidivi
yeveḽa nīmoha miṭṭegādā