ఆఱడిఁ బెట్టఁగనేల ఆతని నింతేసి నీవు
(॥పల్లవి॥)
ఆఱడిఁ బెట్టఁగనేల ఆతని నింతేసి నీవు
మీఱక బంగారుపీఁటమీఁదఁ గూచుండవే
(॥॥)
కొంగుపట్టి తియ్యనేలే కొసర నేమిటికే
సంగతెఱిఁగిన నెరజాణ విభుని
ముంగిట నున్నాఁ డుతఁడు మొక్కితే నెఱుకగాదా
రంగుగాఁ దానే వచ్చీ రావే లోపలికి
(॥॥)
విన్నపము సేయనేలే వేఁడుకొన నింత యేలే
సన్న దెలిసినయట్టి సరసునికి
కన్నాఁడు నీగుట్టు వేళగాచుటే తగులుగాదా
పన్ని నిన్ను నేలీఁగాని పఱవవే పానుపు
(॥॥)
చనవునఁ దిట్టనేలే చవులు చూపఁగనేలే
యెనసిన శ్రీవేంకటేశు నెదుట
ననిచి వున్నాఁ డితఁడు నగుటే వుంకువగాదా
తనివి నొందించి యింకాఁ దడవవే కాఁగిట
(||pallavi||)
āṟaḍim̐ bĕṭṭam̐ganela ādani niṁtesi nīvu
mīṟaga baṁgārubīm̐ṭamīm̐dam̐ gūsuṁḍave
(||||)
kŏṁgubaṭṭi tiyyanele kŏsara nemiḍige
saṁgadĕṟim̐gina nĕrajāṇa vibhuni
muṁgiḍa nunnām̐ ḍudam̐ḍu mŏkkide nĕṟugagādā
raṁgugām̐ dāne vachchī rāve lobaligi
(||||)
vinnabamu seyanele vem̐ḍugŏna niṁta yele
sanna dĕlisinayaṭṭi sarasunigi
kannām̐ḍu nīguṭṭu veḽagāsuḍe tagulugādā
panni ninnu nelīm̐gāni paṟavave pānubu
(||||)
sanavunam̐ diṭṭanele savulu sūbam̐ganele
yĕnasina śhrīveṁkaḍeśhu nĕduḍa
nanisi vunnām̐ ḍidam̐ḍu naguḍe vuṁkuvagādā
tanivi nŏṁdiṁchi yiṁkām̐ daḍavave kām̐giḍa