Aaṟadim bettagu mammu nappadi neevu

ఆఱడిఁ బెట్టకు మమ్ము నప్పటి నీవు
Language

(॥పల్లవి॥)
ఆఱడిఁ బెట్టకు మమ్ము నప్పటి నీవు
ఆఱ నీవు నా కోపము అప్పటి నీవూ

(॥ఆఱడి॥)
మందు మందె సోఁక నాడి మొరఁగి లే దనేపతి
కందాలు చెప్ప వచ్చేవు అప్పటి నీవు
సందె మాడి వోడి తానె పగ చాటీ లోలోన
అందు కేల నవ్వేనే అప్పటి నీవు

(॥ఆఱడి॥)
సంగతి గానిచేఁతలు సారెఁ జేసినట్టివాని
నంగవించి కూడు మనే వప్పటి నీవు
ముంగిట వాఁడుండఁ గాను మొక్కి మొక్కిమావలపె
అంగడి వేసేవు మేలే అప్పటి నీవు

(॥ఆఱడి॥)
యింటికి నాతనిఁ దెచ్చి యిట్టె కాఁగిలించు మంటా
అంటించేవు బటిమినే అప్పటి నీవు
దంట శ్రీవెంకటేశుఁడు తానె కలసె నీమాఁట
కంటే నన రాదు మొక్కే వప్పటి నీవూ

(||pallavi||)
āṟaḍim̐ bĕṭṭagu mammu nappaḍi nīvu
āṟa nīvu nā kobamu appaḍi nīvū

(||āṟaḍi||)
maṁdu maṁdĕ som̐ka nāḍi mŏram̐gi le danebadi
kaṁdālu sĕppa vachchevu appaḍi nīvu
saṁdĕ māḍi voḍi tānĕ paga sāḍī lolona
aṁdu kela navvene appaḍi nīvu

(||āṟaḍi||)
saṁgadi gānisem̐talu sārĕm̐ jesinaṭṭivāni
naṁgaviṁchi kūḍu mane vappaḍi nīvu
muṁgiḍa vām̐ḍuṁḍam̐ gānu mŏkki mŏkkimāvalabĕ
aṁgaḍi vesevu mele appaḍi nīvu

(||āṟaḍi||)
yiṁṭigi nādanim̐ dĕchchi yiṭṭĕ kām̐giliṁchu maṁṭā
aṁṭiṁchevu baḍimine appaḍi nīvu
daṁṭa śhrīvĕṁkaḍeśhum̐ḍu tānĕ kalasĕ nīmām̐ṭa
kaṁṭe nana rādu mŏkke vappaḍi nīvū