ఆఱడిఁ బెట్టక మాతో నానతీవయ్యా
(॥పల్లవి॥)
ఆఱడిఁ బెట్టక మాతో నానతీవయ్యా
మీఱరాదు ఇచ్చకపు మీవారమే నేము
(॥ఆఱ॥)
చుట్టరికముసేసుక సుద్దులెల్లఁ జెప్పేవు
నెట్టన నీరచలు నిజమా యిది
చెట్టాపట్టు వట్టుక సిగ్గులు విడిపించేవు
నట్టపడుమ నివెల్లా నమ్మవచ్చునా
(॥ఆఱ॥)
సారె సారె నియ్యరానిచనవులెల్లా నిచ్చేవు
కోరి యివెల్లా నియ్యకోలవునా
పేరడిగా ననుపులే పెనఁచేవు నాతోను
సారెకు విలువలెనే సతములయ్యవా
(॥అఱ॥)
పరపుపైఁ బవళించి బాసలెల్లాఁ జేసేవు
అరనే నింకొక్కమాఁటు అవునా యిది
యిరవై శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
మురిపెముతోడుతను మొక్కుదునా యిందుకు
(||pallavi||)
āṟaḍim̐ bĕṭṭaga mādo nānadīvayyā
mīṟarādu ichchagabu mīvārame nemu
(||āṟa||)
suṭṭarigamusesuga suddulĕllam̐ jĕppevu
nĕṭṭana nīrasalu nijamā yidi
sĕṭṭābaṭṭu vaṭṭuga siggulu viḍibiṁchevu
naṭṭabaḍuma nivĕllā nammavachchunā
(||āṟa||)
sārĕ sārĕ niyyarānisanavulĕllā nichchevu
kori yivĕllā niyyagolavunā
peraḍigā nanubule pĕnam̐sevu nādonu
sārĕgu viluvalĕne sadamulayyavā
(||aṟa||)
parabubaim̐ bavaḽiṁchi bāsalĕllām̐ jesevu
arane niṁkŏkkamām̐ṭu avunā yidi
yiravai śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
muribĕmudoḍudanu mŏkkudunā yiṁdugu