Aanigaamdavada yamtadigi

ఆణికాఁడవట యంతటికి
Language

(॥పల్లవి॥)
ఆణికాఁడవట యంతటికి
జాణవు తెలియము సరిగొనవయ్యా

(॥ఆణి॥)
ముంగిట చెమటలముత్యపుఁ బూసలు
అంగన లోలో నమ్మీనదె
ఇంగితంపువెల లెరుఁగుదువటవో
యంగడిబేహారి యవి గొవవయ్యా

(॥ఆణి॥)
మొల్లమి మాచెలి మోవిమాణికము
అల్ల వెలకు నీ కమ్మీనదె
తొల్లి నీవు సూదులవాట్లచేఁ
గొల్ల లడిగితట కొనవయ్యా

(॥ఆణి॥)
విడుదలచూపుల నీలంబులు నీ-
వడిగినంతకే యమ్మీనదే
పడతిఁదె శ్రీవేంకటపతి నీ విదె
యెడయనికాఁగిట నిటు గొనవయ్యా

(||pallavi||)
āṇigām̐ḍavaḍa yaṁtaḍigi
jāṇavu tĕliyamu sarigŏnavayyā

(||āṇi||)
muṁgiḍa sĕmaḍalamutyabum̐ būsalu
aṁgana lolo nammīnadĕ
iṁgidaṁpuvĕla lĕrum̐guduvaḍavo
yaṁgaḍibehāri yavi gŏvavayyā

(||āṇi||)
mŏllami māsĕli movimāṇigamu
alla vĕlagu nī kammīnadĕ
tŏlli nīvu sūdulavāṭlasem̐
gŏlla laḍigidaḍa kŏnavayyā

(||āṇi||)
viḍudalasūbula nīlaṁbulu nī-
vaḍiginaṁtage yammīnade
paḍadim̐dĕ śhrīveṁkaḍabadi nī vidĕ
yĕḍayanigām̐giḍa niḍu gŏnavayyā