ఆనేల పెట్టుమనేవు అంతలో నీపై
(॥పల్లవి॥)
ఆనేల పెట్టుమనేవు అంతలో నీపై
తానకమై నీకాపెకుఁ దగునిపుడు
(॥ఆనే॥)
మిగులాఁజక్కనిదైనమెలుఁత నొక్కతె నీకు
తగిలించే వచ్చేవా తరి నావెంట
మగువ నాదోమతెరమంచములో నున్నది
నగనేల అప్పుడుగా నన్ను మెచ్చేది
(॥ఆనే॥)
నీ కాపెకుఁ బొందుసేసి నిన్ను సంతోసించఁజేసే
వాకిచిచ మాఁటాడదు వలెనా నీకు
దాకొనీ గుట్టుమానిసి తలుపు ముయ్యుము వేగ
పైకొని యేల కొంకేవు పండీ నియ్యాన
(॥ఆనే॥)
నెలవై శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
యెలయించేనా నీకు నెవ్వరైరేమి
అలరి ఇదివో అంటే అట్టె కాఁగిలించితివి
కలసితి నేనే ఆపెగానా యీడను
(||pallavi||)
ānela pĕṭṭumanevu aṁtalo nībai
tānagamai nīgābĕgum̐ dagunibuḍu
(||āne||)
migulām̐jakkanidainamĕlum̐ta nŏkkadĕ nīgu
tagiliṁche vachchevā tari nāvĕṁṭa
maguva nādomadĕramaṁchamulo nunnadi
naganela appuḍugā nannu mĕchchedi
(||āne||)
nī kābĕgum̐ bŏṁdusesi ninnu saṁtosiṁcham̐jese
vāgisisa mām̐ṭāḍadu valĕnā nīgu
dāgŏnī guṭṭumānisi talubu muyyumu vega
paigŏni yela kŏṁkevu paṁḍī niyyāna
(||āne||)
nĕlavai śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
yĕlayiṁchenā nīgu nĕvvarairemi
alari idivo aṁṭe aṭṭĕ kām̐giliṁchidivi
kalasidi nene ābĕgānā yīḍanu