ఆనలునుఁ బెట్టు దుగా అప్పటి నందుకుఁ దోడు
(॥పల్లవి॥)
ఆనలునుఁ బెట్టు దుగా అప్పటి నందుకుఁ దోడు
కానీ లేరా దాని పైనే కన్ను లెఱ్ఱఁ జేయరా
(॥॥)
అంటినవి నీ వురమునందు నెవ్వతెవో కాని
జంటల వట్రువలైన చన్నుల గురుతులు
కంటకా లాడిన నన్ను కల్లఁజేయ వత్తువుగా
వెంటనే నీవల పదే వెలివేసెఁ గదరా
(॥॥)
అలరె నీ వీఁపు నను అవి యెవ్వతెవో కాని
కళుకు వ్రాసిన యట్టి కంకణాల వొత్తులు
బలిమి సాదు వలెనే పంతమాడ వత్తువుగా
యెలమి నిన్నట్టే రూఢి కెక్కించెఁ గదరా
(॥॥)
యిదె నీ చెక్కుల జారె నెవ్వతె చెవిదో కాని
సదరపు బొట్లే జవ్వాది కరఁగులు
కదిసి శ్రీ వేంకటేశ కౌఁగిట నీవు గూడఁగా
యెదుట నన్నట్టే అది యెంత సేసీఁజూడరా
(||pallavi||)
ānalunum̐ bĕṭṭu dugā appaḍi naṁdugum̐ doḍu
kānī lerā dāni paine kannu lĕṭram̐ jeyarā
(||||)
aṁṭinavi nī vuramunaṁdu nĕvvadĕvo kāni
jaṁṭala vaṭruvalaina sannula gurudulu
kaṁṭagā lāḍina nannu kallam̐jeya vattuvugā
vĕṁṭane nīvala pade vĕlivesĕm̐ gadarā
(||||)
alarĕ nī vīm̐pu nanu avi yĕvvadĕvo kāni
kaḽugu vrāsina yaṭṭi kaṁkaṇāla vŏttulu
balimi sādu valĕne paṁtamāḍa vattuvugā
yĕlami ninnaṭṭe rūḍhi kĕkkiṁchĕm̐ gadarā
(||||)
yidĕ nī sĕkkula jārĕ nĕvvadĕ sĕvido kāni
sadarabu bŏṭle javvādi karam̐gulu
kadisi śhrī veṁkaḍeśha kaum̐giḍa nīvu gūḍam̐gā
yĕduḍa nannaṭṭe adi yĕṁta sesīm̐jūḍarā