Aanalu vettagu nannu namtesi neevu

ఆనలు వెట్టకు నన్ను నంతేసి నీవు
Language

(॥పల్లవి॥)
ఆనలు వెట్టకు నన్ను నంతేసి నీవు
కానీలే నీ మతి నింత గలిగితేనే చాలును

(॥॥)
నీ మాట నీకు వచ్చెనె నిన్నేమీ ననలేను
ఆ మీఁదటిపను లిట్టే ఆడవలెనా
కామించి నేఁ బదరితే కక్కూరితిదాన నౌదు
యీ మెలఁత లిద్దరును యెఱిఁ గుంటెఁ జాలును

(॥॥)
నిన్ను నే మెప్పించితిని నే నే మంచిదాన నైతి
సన్నలవలపు నీపైఁ జల్లవలెనా
నన్ను నేనే మెచ్చుకొంటే నగుఁబాటుదాన నౌదు
నిన్న నేఁటి పంతములు నిలిచితేఁ జాలునూ

(॥॥)
నీవే నన్నుఁ గూడితివి నీ కౌఁగిట నున్నదాన
యీ వేళనే మోవితేనె యియ్యవలెనా
శ్రీ వేంకటేశ నిన్నుఁ జెనకితే గబ్బి నౌదు
యీ విధాన నా పొందు నీ కిత వైతేఁ జాలునూ.

(||pallavi||)
ānalu vĕṭṭagu nannu naṁtesi nīvu
kānīle nī madi niṁta galigidene sālunu

(||||)
nī māḍa nīgu vachchĕnĕ ninnemī nanalenu
ā mīm̐daḍibanu liṭṭe āḍavalĕnā
kāmiṁchi nem̐ badaride kakkūrididāna naudu
yī mĕlam̐ta liddarunu yĕṟim̐ guṁṭĕm̐ jālunu

(||||)
ninnu ne mĕppiṁchidini ne ne maṁchidāna naidi
sannalavalabu nībaim̐ jallavalĕnā
nannu nene mĕchchugŏṁṭe nagum̐bāḍudāna naudu
ninna nem̐ṭi paṁtamulu nilisidem̐ jālunū

(||||)
nīve nannum̐ gūḍidivi nī kaum̐giḍa nunnadāna
yī veḽane movidenĕ yiyyavalĕnā
śhrī veṁkaḍeśha ninnum̐ jĕnagide gabbi naudu
yī vidhāna nā pŏṁdu nī kida vaidem̐ jālunū.